పర్యాటక ప్రాంతాలు కిటకిట
చింతపల్లి: మండలంలో లంబసింగికి పర్యాటకుల తాకిడి నెలకొంది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఆదివారం తెల్లవారుజామున ఇక్కడికి చేరుకున్నారు. చెరువుల వేనం వ్యూపాయింట్‌కు తరలివెళ్లారు. తాజంగి జలాశయం వద్ద ఆదివారం సాయంత్రం వరకు పర్యాటకులు వస్తూనే ఉన్నారు.
జి.మాడుగుల: కొత్తపల్లి జలపాతానికి దూర ప్రాంతాల నుంచి భారీగా పర్యాటకులు తరలివచ్చారు. ఆదివారం వీకెండ్ కావడంతో ప్రత్యేక వాహనాల్లో రావడంతో సందడి నెలకొంది. వ్యూపాయింట్ వద్ద ఫొటోలు సెల్ఫీలు దిగారు.
డుంబ్రిగుడ: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం చాపరాయి జలవిహారిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. గత నాలుగురోజుల క్రితం వర్షాల ప్రభావంతో అంతంతమాత్రంగా వచ్చిన పర్యాటకులు ఆదివారం భారీగా తరలివచ్చారు. అంజోడ సిల్క్ ఫారం అరకు పైనరీకి పర్యాటకుల తాకిడి నెలకొంది. గిరి మహిళ వస్త్రధారణలో పర్యాటకులు అలరించారు. థింసా నృత్యం తిలకిస్తూ ఉత్సాహంగా గడిపారు. పంతలచింత వద్ద పొద్దుతిరుగుడు తోటలో ఫొటోలు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment