‘జింక మాంసం’ ఘటనలో నలుగురిపై కేసు
రాజవొమ్మంగి: మండలంలోని లోతట్టు గ్రామం ముంజవరప్పాడులో దుప్పి (చుక్కల జింక) మాంసం కలిగి ఉన్న నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని ఫారెస్ట్ రేంజ్ అధికారి ఉషారాణి ఆదివారం తెలిపారు. పక్కా సమాచారం మేరకు శనివారం ఈ గ్రామానికి వెళ్లిన అటవీశాఖ అధికారులు వన్యప్రాణి దుప్పి మాంసం స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు అనంతరం అడవి జంతువు మాంసంతో పట్టుబడిన నలుగురు వ్యక్తులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశామని ఫారెస్ట్ రేంజ్ అధికారి ఉషారాణి పేర్కొన్నారు. ఇప్పటికే వీరి నుంచి దుప్పి చర్మం, కొంత మాంసం స్వాధీనం చేసుకున్నామని ఆమె వివరించారు. నిందితులను పట్టుకోవడంలో సెక్షన్ ఫారెస్టర్ రాము, ఎఫ్‌బీవోలు ఆనందబాబు, సూర్యప్రసాద్, బేస్‌క్యాంపు సిబ్బంది కృష్ణప్రసాద్, రమేష్ కీలకంగా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment