ఫిబ్రవరి 9న రేల పండగ
● ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట
ప్రచార కార్యదర్శి సోడె మురళి
● విజయవంతం చేయాలని పిలుపు
చింతూరు: వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న రంపచోడవరంలో నిర్వహించనున్న రేల పండుగను విజయవంతం చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట ప్రచార కార్యదర్శి సోడె మురళి పిలుపునిచ్చారు. స్థానిక గురుకుల కళాశాలలో ఆదివారం పరిషత్ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిమ తెగల సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజన చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని, యువత కోసం ఉద్యోగభద్రత చట్టం తీసుకురావాలని ఆయన కోరారు. గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమ్మె కారణంగా ఆదివాసీ విద్యార్థులకు సరైన బోధన అందడంలేదని, ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 31న పరిషత్ ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరిషత్ మండల ప్రధాన కార్యదర్శి సోడె రాఘవయ్య, పాయం సాయిరాం, గణేష్, తేజ, వంశీ, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment