వలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పల్లపు వెంకట్
చింతూరు: గ్రామ, వార్డు వలంటీర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పల్లపు వెంకట్, గిరిజన సంఘం జిల్లా నాయకుడు సీసం సురేష్ డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం చింతూరులో గ్రామ, వార్డు వలంటీర్ల యూనియన్ రంపచోడవరం డివిజన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వలంటీర్ల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు వారితో కలసి చింతూరు ఐటీడీఏ ఎదుట నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి వలంటీర్ల పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ఉద్యోగభద్రత కల్పించాలని వారు కోరారు. ఎన్నికల హమీల్లో భాగంగా వలంటీర్లకు రూ. పదివేల వేతనం ఇస్తానన్న హమీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని వారు కోరారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు పొడియం జానీ, కలుముల మహేష్, దుర్గారావు, రామిరెడ్డి, రమేష్, స్రవంతి, పద్మావతి, శాంతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment