స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి

Published Mon, Dec 23 2024 1:29 AM | Last Updated on Mon, Dec 23 2024 1:29 AM

స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి

స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి

హుకుంపేట: స్వయం ఉపాధితో గిరిజన మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్‌ సూచించారు.మండలంలోని గడుగుపల్లిలో శ్రీ సత్యసాయి గిరిజన సేవ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సత్యసాయి ప్రేమమృత వృత్తి నైపుణ్యాభివృద్ది శిక్షణ కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో మహిళలు ఎటువంటి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అందుబాటులోకి వచ్చిన కుట్టు శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి ట్రస్ట్‌ సిబ్బంది నాగప్రసాద్‌, అమ్మాజి, సత్యసాయి ట్రస్ట్‌ జిల్లా అధ్యక్షుడు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్‌

కుట్టుశిక్షణ కేంద్రం ప్రారంభం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement