కళ్లకు గంతలు కట్టుకుని నిరసన
రంపచోడవరం : గురుకుల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆదివారం వినూత్నంగా నిరసన తెలిపారు. స్థానిక ఐటీడీఏ ఎదుట చేపట్టిన దీక్షలు ఆదివారం నాటికి 37వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయమైన కోరికలను సాధించుకునేందుకు శాంతియుతంగా చేపట్టిన నిరసనలను అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నా రు. తాము చేపట్టిన నిరసనలకు యూటీఎఫ్, సీపీఎం, గిరిజన సంఘాలు ప్రకటించాయని అవుట్ సోర్సింగ్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు అనంత కుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుకులాల అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు శామ్యూల్, తాతాజీ, సత్యనారాయణ రెడ్డి, పాపయమ్మ, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
37వ రోజుకు చేరిన గురుకులాల అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల దీక్షలు
Comments
Please login to add a commentAdd a comment