వైజ్ఞానిక ప్రదర్శనలతో సృజనాత్మకత
పాడేరు : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మతకను, ప్రతిభను వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని కలెక్టర్ దినేష్‌కుమార్ పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని తలార్‌సింగి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల ఆవరణలోని ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనుజారాణితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. దివంగత డాక్టర్ అబ్దుల్ కలాం, సర్ సీవీ రామన్, సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ చిత్రపటాలకు పూలమామలు వేసి నివాళులు అర్పించారు. విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను తిలకించారు. వాటి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ మూడు నెలలకు ఒకసారి ప్రతి పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాల్లో చదివిన అంశాలను చక్కగా ప్రదర్శించారన్నారు. అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనుజారాణి మాట్లాడుతూ గిరిజన విద్యార్థులను శాస్త్ర, సాంకేతిక రంగాల వైపు మళ్లించేందుకు తరచుగా వైద్య వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులంతా అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విద్యార్ధులకు తనవంతు సహాయం అందిస్తానని చెప్పారు. అనంతరం గత నెల 30న విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆండ్ ఆర్కిటెక్చర్‌లో జరిగిన పలు క్రీడాంశాల్లో గెలుపొందిన గిరిజన విద్యార్థులకు ప్రశంశా పత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పి. బ్రహ్మాజీరావు, హెచ్‌ఎంలు నాగేశ్వరరావు, శేషగిరి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్
పాడేరులో జిల్లాస్థాయి ప్రదర్శన
ప్రారంభం
అబ్దుల్ కలాంను ఆదర్శంగా
తీసుకోవాలి: అరకు ఎంపీ తనూజరాణి
Comments
Please login to add a commentAdd a comment