సంస్కరణలతోనే విద్యారంగం అభివృద్ధి
చింతపల్లి: సంస్కరణలతోనే విద్యారంగం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని జేసీ అభిషేక్‌గౌడ అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో శనివారం ప్రభుత్వం చేపట్టిన డొక్కాసీతమ్మ మధ్యాహ్నభోజన పథకం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుఽలకు భోజనాలు వడ్డించారు. వారితో కలసి భోజనాలు చేశారు. విద్యార్థి దశనుంచి లక్ష్యంతో చదవాలని సూచించారు. కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు వల్ల ఆదా అవుతున్న సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోతురాజుబాలయ్య, ఎంీపీడీవో శ్రీనివాస్, సర్పంచ్ దురియా పుష్పలత, ప్రిన్సిపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు.
చదువుపై దృష్టి సారించాలి
హుకుంపేట: చదువుపై దృష్టి సారించి ఉన్నతస్థాయికి ఎదగాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సూచించారు. శనివారం స్థానిక జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ పథకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు,వైస్‌ప్రిన్సిపాల్ కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, సర్పంచ్ సాంబశివరావు, వైస్ సర్పంచ్ గోవింద్ పాల్గొన్నారు.
రంపచోడవరం: ఏజెన్సీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్ధులు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం పీవో , సబ్ కలెక్టర్ కల్పశ్రీలు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యంతో చదివి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు, ఎంఈవో ఎం.రామకృష్ణ, ప్రిన్సిపాల్ ఎ.శ్రీనివాసరావు, హెచ్‌ఎం పద్మావతి, విద్యా కమిటీ చైర్మన్ సుందర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
జేసీ అభిషేక్ గౌడ
Comments
Please login to add a commentAdd a comment