నాడు భరోసా.. నేడు దగా..
చంద్రబాబు ప్రభుత్వం రైతులను నిలువునా ముంచేసింది. గత ప్రభుత్వంలో రైతుకు అడుగడుగునా కొండంత భరోసా లభించింది. పెట్టుబడి సాయం నుంచి విత్తనాల పంపిణీ, పారదర్శకంగా విత్తనాల కొనుగోలు వరకు రైతుకు అండగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నీ కష్టాలే. సూపర్ సిక్స్ హామీలో ఒకటైన అన్నదాత సుఖీభవ నగదు వేయకపోవడంతో అప్పు చేసి ఖరీఫ్ సీజనులో పెట్టుబడి పెట్టాం. ఇప్పుడేమో తుపాను కారణంగా చేలన్నీ నేలవాలిపోయి ఉన్నాయి. కోత కోయలేని పరిస్థితిలో ఉన్నాం. ధాన్యం కొనుగోలు దళారులకు అప్పగించారు. ఇక రైతు కోలుకునే అవకాశమే లేదు.
– గొల్లు నానిబాబు, రైతు, కె.వెంకటాపురం, కోటవురట్ల మండలం
హామీలను విస్మరించారు
ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు విస్మరించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు అమలు చేయలేదు. మాజీ సీఎం జగన్ రైతు పక్షపాతిగా పాలన సాగించారు. ఈ ప్రభుత్వంలో రైతులకు ఒరిగిందేమీలేదు. పంట నష్టం పరిహారం కూడా అర్హులకు అందలేదు.
–బొద్దపు శ్రీరామమూర్తి, రైతు, ఒంపోలు, మునగపాక మండలం
●
Comments
Please login to add a commentAdd a comment