లారీ డ్రైవర్ అనుమానాస్పద మృతి
అనకాపల్లి : బవులవాడ గ్రామంలో స్టోన్ క్రషర్‌లో పనిచేస్తున్న లారీ డ్రైవర్ చవితిని నాగ సత్య సన్యాసిరావు(47) శనివారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందినట్టు రూరల్ సీఐ అశోక్‌కుమార్ ఆదివారం చెప్పారు. సీఐ కథనం మేరకు వివరాలివి. శనివారం రాత్రి స్టోన్‌క్రషర్‌కు నాగసత్య సన్యాసిరావు లారీని తీసుకుని లోడింగ్‌కు వెళ్లాడు. అక్కడే ఉన్న మరో డ్రైవర్, క్రషర్ సిబ్బంది సన్యాసిరావు మద్యం సేవించి ఉండడంతో లారీని తీసుకుని వెళ్లొద్దని చెప్పడం జరిగింది. దీంతో రాత్రి అంతా క్రషర్ వద్ద చలిలో పడుకుని ఉండడంతో తెల్లవారే సరికి సన్యాసిరావు మృతి చెంది ఉన్నట్టు గుర్తించినట్టు సీఐ చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి, అనుమానాస్పదంగా కేసు నమోదు చేయడం జరిగిందని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment