రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు
డిసెంబర్ నెలలో విశాఖ ఎయిర్‌పోర్టు అదరగొట్టింది. ప్రయాణికుల రాకపోకలు, విమాన సర్వీసుల పరంగా విశాఖ ఎయిర్‌పోర్టు మంచి ఫలితాలు రాబట్టుకుంది. స్వదేశీ ప్రయాణికుల రాకపోకల్లో 2023 డిసెంబర్‌తో పోలిస్తే ఈ సారి 23.39 శాతం వృద్ధి సాధించింది.
అదేవిధంగా.. డొమెస్టిక్ విమాన సర్వీసుల్లోనూ 21.22 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇక అంతర్జాతీయ పాసింజర్ల విషయంలోనూ అదే జోరు కొనసాగింది. అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకల్లో ఏకంగా 115.04 శాతం వృద్ధి నమోదవ్వగా.. అంతర్జాతీయ విమాన సర్వీసుల్లోనూ 115.79 శాతం నమోదైంది. గతంతో పోలిస్తే పోలిస్తే అదనంగా సర్వీసులు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Please login to add a commentAdd a comment