అత్తారింట విందు... భలే పసందు
మునగపాక : గ్రామీణ ప్రాంతాల్లో సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారు. ఎక్కడో తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొత్త అల్లుళ్ల కోసం అత్తవారు పలు రకాల పిండివంటలతో విందు భోజనం ఏర్పాటు చేయడం అనవాయితీగా వస్తుంది. ఇదే సంప్రదాయం ఇపుడు ఉమ్మడి విశాఖ జిల్లాకు పాకుతుంది. గవర్ల అనకాపల్లిలో బ్రాంచి పోస్టుమాస్టర్ పొలమరశెట్టి జగ్గారావు ఇంటిలో సంక్రాంతి సందడి కనిపించింది. జగ్గారావు–అన్నపూర్ణ దంపతుల కుమార్తె జిషితను అనకాపల్లికి చెందిన చదరం చిన నూకరాజు–ప్రభావతి దంపతుల కుమారుడు వంశీతో వివాహం చేశారు. ఈ దంపతులకు 78 రకాల పిండివంటలతో విందుభోజనం ఏర్పాటు చేశారు. అలాగే మునగపాకకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు వెలగా సూర్యనారాయణ ద్వితీయ కుమారుడు అర్మీ రిటైర్డ్ ఉద్యోగి జగన్నాథరావు–గీత కుమారుడు సూర్యతేజకు గవర్ల అనకాపల్లికి చెందిన పొలమరశెట్టి చందు–వరలక్ష్మి దంపతుల కుమార్తె జ్యోష్ణకు వివాహం జరిగింది. కొత్త జంట కావడంతో అత్తమామలు వారికి 78 రకాల పిండివంటలతో తయారు చేసిన వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. ఇరు దంపతులు అత్తవారింట జరిగిన మర్యాదల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నోరూరించే వంటకాలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని అల్లుళ్లు సూర్యతేజ, వంశీలు హర్షం వ్యక్తం చేశారు.
చిన్నబాబు కాలనీలో 120 వంటకాలతో...
అనకాపల్లి : అనకాపల్లి మండలం చిన్నబాబు కాలనీకి చెందిన వేగి విశ్వేశ్వరరావు శారదా దంపతుల కుమార్తె వర్థినికి వివాహం జరిగింది. మొదటి సంక్రాంతికి రావడంతో కుమార్తె వర్థిని అల్లుడు ఆడారి భరత్‌వాజ్‌లకు 120 రకాల పిండివంటకాలతో విందును ఏర్పాటు చేశారు. పసందైన విందుతో కొత్త అల్లుడికి స్వాగతం పలికారు. చుట్టుపక్కల ప్రజలు ఈ కొత్త సంప్రదాయాన్ని ఆసక్తిగా తిలకించారు.
● కొత్త అల్లుళ్లకు 78 వంటకాలతో భోజనం
Comments
Please login to add a commentAdd a comment