ఎన్నో బహుమతులు కొట్టాను...
సంక్రాంతి తీర్థాలు వచ్చాయంటే పరుగుల పోటీ కోసం నా గుర్రాన్ని ముందుగానే సిద్ధం చేస్తాను. మంచి ఆహారం పెట్టడంతో పాటు పరుగులో కూడా శిక్షణ ఇస్తాను. గత రెండేళ్లల్లో తూర్పుగోదావరి జిల్లా తుని, సామర్లకోటలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో నా గుర్రం మొదటి స్థానం సాధించింది. రుద్ర రైడర్ పేరుతో నా గుర్రాన్ని పోటీకి దించుతాను. రాష్ట్ర స్థాయి పోటీల్లో మొత్తం 150 గుర్రాల వరకు వివిధ జిల్లాల నుంచి పాల్గొంటాయి. అతి తక్కువ సమయంలో 3.11.6 నిమిషాల్లో 4 కిలోమీటర్ల మేర పరుగుపెట్టి అన్ని గుర్రాల కంటే ముందుగా నా గుర్రం లక్ష్యాన్ని చేరుకుంది. ఈ ఏడాది కూడా జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో నా గుర్రాన్ని పరుగుల పోటీకి దించాలని సిద్ధం చేశాను.
–దాడి కోటేశ్వరరావు, గుర్రపు రౌతు, రాయపురాజుపేట
భలే మజా..
గుర్రపు స్వారీలో ఉండే ఆనందమే వేరు. పోటీలో పాల్గొనే గుర్రాలకు మంచి దానా పెట్టాల్సి ఉంటుంది. మేలు జాతి గుర్రాలైతే రూ.2, 3 లక్షలు వరకు ధర ఉంటుంది. ఇటువంటి గుర్రంపై స్వారీ చేస్తే ఆ మజానే వేరేగా ఉంటుంది. నేను సుమారు రూ1.30 లక్షలు పెట్టి గుర్రాన్ని కొన్నాను. అనేక సార్లు పోటీల్లో పాల్గొని చాలా బహుమతులు కూడా కొట్టాను. పోటీల్లో గుర్రంపై దౌడుతీస్తుంటే ఆ జోష్ చాలా బాగుంటుంది.
– రాజేష్, గుర్రం పెంపకందారు, గోపాలపట్నం
Comments
Please login to add a commentAdd a comment