అదిగో పులి!
● రాంబిల్లిలో వదంతులు ● సోషల్ మీడియాలో వీడియోలు , ఫొటోలు వైరల్
రాంబిల్లి నేవీ కాలనీ గుడి వద్ద పులిగా భావిస్తున్న జంతువు
రాంబిల్లి యలమంచిలి) : మండలంలోని నేవీ కాలనీ శివారు నిర్మాణంలో ఉన్న ఆలయానికి సమీపంలో పులి సంచరిస్తున్నట్టు గరువారం వదంతులు తలెత్తాయి. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో కొందరు స్థానికులు అటువైపుగా వెళుతుండగా దూరంలో పులిలాంటి జంతువును చూసి భయభ్రాంతులకు గురయ్యారు. కొందరు యువకులు గుడి పక్క కూర్చుని ఉన్న జంతువుకి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పులి సంచరిస్తున్నట్టు పోస్ట్ చేశారు. ఈ వీడియో భాగా స్ధానికంగా వైరల్ కావడంతో అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. పులి సంచరిస్తున్న సమాచారంపై యలమంచిలి అటవీశాఖ బీట్ అధికారి వెంకటరమణను సంప్రదించగా అది పులికాకపోవచ్చునని, ఒక వేళ పులి సంచరిస్తున్నట్టయితే ఆహారం కోసం ఏదో ఒక జంతువును వేటాడుతుందన్నారు. శుక్రవారం నేవీ కాలనీ ప్రాంతాన్ని పరిశీలించి స్పష్టతనిస్తానన్నారు. దీనిపై రాంబిల్లి పోలీసులు కూడా తమను సంప్రదించారని ఆయన సాక్షికి ఫోన్‌లో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment