విశాఖ విద్య: సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. విశాఖపట్నం– చెర్లపల్లి– భువనేశ్వర్ మధ్య ప్రత్యేక రైలు(08549/08550) నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. రైలు నంబర్ 08549 విశాఖపట్నంలో ఈ నెల 18న సాయంత్రం 7.45 గంటలకు బయలుదేరుతుంది. రాత్రి 8.18 గంటలకు దువ్వాడ చేరుకుని, 8.20 గంటలకు అక్కడ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు చెర్లపల్లి చేరుకుంటుంది. రైలు నంబర్ 08550 ఈ నెల 19న ఉదయం 9 గంటలకు చెర్లపల్లిలో బయలుదేరి సాయంత్రం 6.40 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. దువ్వాడలో 6.45 గంటలకు బయలుదేరి రాత్రి 7.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖలో రాత్రి 7.50 గంటలకు బయలుదేరి ఈ నెల 20వ తేదీ తెల్లవారుజామున 2.15 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది.
గిరిజన మ్యూజియంకు రూ.6.8 లక్షల ఆదాయం
అరకులోయ టౌన్: గిరిజన మ్యూజియంకు ఈ ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా మూడు రోజుల్లో ఎంట్రీ టికెట్ల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దేశ, విదేశాల నుంచి విశాఖ–కిరండూల్ ప్యాసింజర్ రైలుతోపాటు సొంత వాహనాల్లో అరకు అందాలు తిలకించేందుకు భారీగా రావడంతో ఇంత ఆదాయం సమకూరిందని నిర్వహకులు తెలిపారు. పండగ మూడు రోజుల పాటు ఎంట్రీ టికెట్ల ద్వారా మొత్తం రూ.6 లక్షల 80 వేలకు పైగా ఆదాయం సమకూరినట్లు మ్యూజియం ఇన్‌చార్జి మణికుమార్, గిరిజన మ్యూజియం ప్రొటోకాల్ ఇన్‌చార్జి గణపతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment