గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
ఎస్.రాయవరం: మండలంలోని రేవుపోలవరం తీరంలో గల్లంతైన కాకర్ల మణికంఠ(22) మృతదేహం గురువారం నక్కపల్లి మండలం చినతీనార్ల తీరం సమీపంలో లభ్యమైంది. ఎస్‌ఐ విభీషణరావు వివరాల మేరకు.. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు మండలం సింహాద్రిపురం గ్రామానికి చెందిన మణికంఠ తుని మండలం లోవ కొత్తూరులో తన మేనమామ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం రేవుపోలవరం తీరానికి వచ్చి గల్లంతైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తీరంలో మునిగిన సాత్విక్‌ను మణికంఠ కాపాడబోయి కెరటానికి కొట్టుకుపోయాడు. ఒడ్డుకు కొట్టుకొచ్చిన మృతదేహానికి పంచనామా నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment