జిల్లా స్థాయి కబడ్డీ పోటీల విజేత తురువోలు
విజేతకు నగదు బహుమతులను అందజేస్తున్న స్థానిక పెద్దలు, యూత్
దేవరాపల్లి: జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో విజేతగా తురువోలు నిలిచింది. మండలంలోని తారువలో మర్లమాంబ తీర్థ మహోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన ఈ పోటీలు అర్ధరాత్రి వరకు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 30 జట్లు పాల్గొనగా, హోరా హోరీగా సాగాయి. ప్రథమ స్థానంలో తురువోలు, ద్వితీయ స్థానంలో పెదగంట్యాడ, తృతీయ స్థానంలో తారువ, నాల్గో స్థానంలో వావిలపాడు జట్లు నిలిచాయి. వీటికి వరుసగా రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.7 వేలు, రూ.4 వేల చొప్పున బహుమతులను గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు అందజేశారు. ఈ పోటీలను తిలకించేందుకు మండల వ్యాప్తంగా ప్రజలు, క్రీడా అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment