సెల్ ఫోన్ లింకులపై సీపీ దృష్టి
వాస్తవానికి స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) కానిస్టేబుల్ ఫోన్ నంబరును పరిశీలిస్తే మరిన్ని లింకులు బయటపడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు సదరు కానిస్టేబుల్ అకౌంట్ ద్వారా కోట్లలో లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. డిపార్టుమెంటులో ప్రస్తుతం పనిచేస్తున్న పలువురు పోలీసులకు కూడా తన ఫోన్ పే ద్వారా నగదును బదిలీ చేశారని సమాచారం. తాజాగా టాస్క్‌ఫోర్స్‌లోని కొంత మందికి కూడా క్రికెట్ బెట్టింగ్ ముఠాలోని సభ్యుల నుంచి ఫోన్ పే ద్వారా నగదు బదిలీ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపైనా విచారణ జరిపితే మరింత మంది డిపార్టుమెంటు దొంగలు బయటపడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు క్రికెట్ బెట్టింగ్ ముఠాలో కీలక పాత్ర పోషిస్తున్న లగుడు రవిని పట్టుకున్న సమయంలో కూడా భారీగానే నగదు దొరికిందనే ప్రచారం జరుగుతోంది. దీనిపైనా ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నట్టు సమాచారం. ఈ నగదును చూపకుండా తప్పించిన వ్యవహారం ఇప్పుడు పోలీసుశాఖలో హాట్ టాపిక్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment