స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌తో అవినాభావ సంబంధం ఉన్న కూటమిలోని ఓ ఎమ్మెల్యేకు నెల నెలా మామూళ్లు ముడుతున్నాయని కూడా తెలుస్తోంది. క్రికెట్ బెట్టింగ్ ముఠా నుంచి మామూళ్లు అందజేయడంలో ఈ కానిస్టేబుల్ కీలకపాత్ర పోషించినట్టు సమాచారం. ఇక మరోవైపు తెలుగుదేశం పార్టీకి చెందిన మరో కీలక ఎమ్మెల్యే పీఏనని చెప్పుకునే దూరపు బంధువు పాత్ర కూడా కీలకంగా ఉంది. వాస్తవానికి క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకున్న తర్వాత టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి ఫోన్ చేసి బెదిరించిన వ్యవహారంలో ఈ పీఏ వ్యవహారశైలిపై కూడా సీపీ సీరియస్‌గా ఉన్నట్టు పోలీసుశాఖలో చర్చ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంపై ‘చిట్టి’గా కాకుండా ‘గట్టి’గా విచారణ జరిపితే దొంగలందరూ బయటకు వస్తారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment