పేట భూములపై కన్ను!
నక్కపల్లి :
పరిశ్రమల కోసం భూసేకరణకు 4(1) నోటిఫికేషన్ విడుదల చేయకుండా నేరుగా రైతులతో బేరసారాలు సాగించి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం మొగ్గు చూపిస్తోంది. భూసేకరణ జరిపితే 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు మార్కెట్ విలువ కంటే మూడు రెట్లు అధికంగా చెల్లించాలి. దీనికి తోడు ఆర్ అండ్ ఆర్‌ప్యాకేజీ, పునరావాసం కల్పించి ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలి. నిర్వాసిత కుటుంబాల్లో మేజర్లకు ప్రత్యేక ప్యాకేజీ వర్తింపజేయాలి. ఇవన్నీ చేయాలంటే సాధ్యం కాని పని. ఈ ప్రక్రియలో భూసేకరణ జరిపితే రైతుకు రూ.1.50 కోట్లు పైనే చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని డైరెక్ట్ పర్చేజింగ్ పేరుతో రైతులతో మాట్లాడుకుని డీ ఫారం భూములకు ఎకరా రూ.25 లక్షలు, జిరాయితీ భూములకు రూ.50 లక్షలు చెల్లించనున్నట్టు సమాచారం. ఇప్పటికే నక్కపల్లి మండలం పెద బోదిగల్లంలో సేకరిస్తున్న భూములకు ఇదే ఫార్ములా పాటిస్తున్నారు. నేరుగా రైతుల నుంచి ఎకరా రూ.30 లక్షలు చెల్లించి ఏపీఐఐసీ పేరున రిజిస్ట్రేషన్‌లు చేయించుకుంటున్నారు. పాయకరావుపేట మండలంలో ప్రతిపాదిత గ్రామాల్లో భూముల ధరలు బహిరంగ మార్కెట్‌లో రూ.60 లక్షల నుంచి కోటి రూపాయల పైబడే ఉన్నాయి.
మండలంలో ఐదు గ్రామాలు గుర్తింపు..
పాయకరావుపేట మండలంలో భూముల కోసం తీరప్రాంతం వెంబడి ఇప్పటికే ఐదు గ్రామాలను ఏపీఐఐసీ వారు గుర్తించారు. పెంటకోటలో 1280 ఎకరాలు, రాజవరంలో 1117 ఎకరాలు, కేశవరంలో 712ఎకరాలు, ఈదటంలో 1951 ఎకరాలు, కందిపూడిలో 188 ఎకరాలు, కుమారపురంలో 1882 ఎకరాలు, మాసయ్యపేటలో 206 ఎకరాలు.. మొత్తం 8386 ఎకరాలు ప్రాజెక్టు కోసం గుర్తించారు. ఇప్పటికే రాజవరం, కేశవరం గ్రామాల్లో సుమారు 260 ఎకరాల్లో డక్కన్ ఫైన్ కెమికల్స్ కంపెనీ ఏర్పాటు చేశారు. పెంటకోట సమీపంలో టౌన్ షిప్ ఏర్పాటు కోసం 452 ఎకరాలను సైతం గుర్తించినట్టు సమాచారం.ఇవేకాకుండా శ్రీరాంపురంలో కూడా మరో 1046 ఎకరాలు సేకరించే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా 8386 ఎకరాలకు సంబంధించి ఏపీఐఐసీ వారు లేఅవుట్ సిద్ధం చేశారు. త్వరలోనే ఈ గ్రామాల రైతులతో మాట్లాడి నేరుగా కొనుగోళ్లు ప్రారంభించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నక్కపల్లి మండలంలో ఏపీఐఐసీ వారు విశాఖ చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణంలో భాగంగా 4500 ఎకరాలు భూములు సేకరించారు. వీటిలో 2200 ఎకరాలను రూ.1877 కోట్ల వ్యయంతో నిర్మించే బల్క్ డ్రగ్ పార్క్‌కోసం కేటాయించారు. ఈ పార్క్ నిర్మాణానికి ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. అలాగే ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ ఇండియా లిమిటెడ్ వారు పోర్టు ఆధారిత స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి ఆసక్తి చూపిస్తున్నారు. తీరప్రాంతానికి దగ్గరగా ఉన్న రాజయ్యపేటలో 2400 ఎకరాలు భూములు కేటాయించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. మొదటి విడతలో రూ.70 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు. రెండో విడతలో మరో 3600 ఎకరాల్లో రూ.80 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. నక్కపల్లి మండలంలో ఒకేసారి బల్క్ డ్రగ్‌పార్క్, స్టీల్‌ప్లాంట్‌కు భూములు కేటాయించడం కష్టతరం కావడంతో ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం పాయకరావుపేట మండలంలో కూడా భూములు సేకరించేందుకు సిద్ధపడినట్టు సమాచారం. తీరప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఈ ఐదు గ్రామాల్లో భూములను గుర్తించి లేఅవుట్ సిద్ధం చేశారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఏపీఐఐసీ ముందడుగు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.
ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా భూ సేకరణ తగదు
పాయకరావుపేట మండలంలో తీరప్రాంత గ్రామాల్లో భూములు సేకరించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న సమాచారం వచ్చింది. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా భూములు సేకరించడం తగదు. రైతులైతే ప్రభుత్వం ఇచ్చిన నష్ట పరిహారంతో వేరొక చోట భూములు కొనుక్కుంటారు. మత్య్సకారులు చేతివృత్తులవారు ఎక్కడకెళ్లి జీవనోపాధి పొందాలి. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు లేవు. పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఇప్పటికే నక్కపల్లి మండలంలో భూములు ఇచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారికి భూసేకరణ సమయంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. ఉన్న ఫళంగా గ్రామాలను ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. ఈ మండలంలో కూడా ఇదే పరిస్థితి ఎదురు కాబోతోంది. మేమంతా తీవ్రంగా వ్యతిరేకిస్తాం.
–చోడిపల్లి శ్రీనివాస్, మత్స్యకార కార్పొరేషన్ మాజీ డైరెక్టర్
మత్స్యకారుల నుంచి వ్యతిరేకత
పాయకరావుపేట మండలంలో భూసేకరణకు ప్రతిపాదిత గ్రామాల్లో అధికంగా మత్స్యకారులే జీవిస్తున్నారు. వేటనే ప్రధానంగా చేసుకుని జీవనోపాధి పొందుతున్నారు. పరిశ్రమల పేరుతో తమ గ్రామాల్లో భూములు లాక్కొంటే మేమెక్కడికి వెళ్లి బతకాలంటూ ఆందోళన వ్యక్తమవుతోంది. నోటిఫికేషన్ విడుదల చేస్తే 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ చెల్లించాల్సి వస్తుందన్న సాకుతో ప్రభుత్వం నేరుగా రైతుల నుంచి డైరెక్ట్ పర్చేజ్ పేరుతో భూములు కారు చౌకగా లాక్కొవాలని చూస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించి నేరుగా కంపెనీల నుంచే కొనుగోలు చేయించాలనే ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
చౌకగా పరిశ్రమలకు కట్టబెట్టే యత్నం
ఐదు గ్రామాల గుర్తింపు
ప్రభుత్వం కళ్లు పాయకరావుపేట
మండలంపై పడ్డాయి. పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టేందుకు ఈ మండలంలో 8 వేల ఎకరాల సేకరణకు రంగం సిద్ధమవుతోంది. ఏపీఐఐసీ మధ్యవర్తిత్వం వహించి నేరుగా రైతుల నుంచి కారుచౌకగా కొనుగోలు చేసి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూసేకరణ కొరకు పాయకరావుపేట మండలంలో తీర ప్రాంతంలో ఐదు గ్రామాలను గుర్తించారు. ఇప్పటికే ఏపీఐఐసీ వారు లే అవుట్‌కూడా సిద్ధం చేశారన్న సమాచారం మండలంలో వ్యాపించడంతో తీరప్రాంత గ్రామాల్లో నివసిస్తున్న మత్య్సకారులు, బడుగు బలహీన వర్గాలు, పేదల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.
తీర
ప్రాంతంలో 8వేల ఎకరాలు సేకరణ
టౌన్‌షిప్ కోసం మరో 452 ఎకరాలు
లేఅవుట్ సిద్ధం చేసిన ఏపీఐఐసీ
Comments
Please login to add a commentAdd a comment