ఏపీ విలేజ్ రెవెన్యూ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ
కె.కోటపాడు: ఏపీ విలేజ్ రెవెన్యూ అసోసియేషన్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం కె.కోటపాడులో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ వీఆర్వో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఈర్లె శ్రీరామ్మూర్తి, వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు సబ్బవరపు త్రినాథ రామకాసు హాజరయ్యారు. వీరు డైరీ, క్యాలెండర్లను అసోసియేషన్ సభ్యులకు అందించారు. ఇటీవల డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందిన కె.కోటపాడు తహసీల్దార్ భాగ్యవతిని ఘనంగా సన్మానించారు. సంఘ ఉపాధ్యక్షుడు పూడి సురేష్, కె.గౌరీశంకర్, శివ, గంగునాయుడు, జగదీష్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment