బైక్ మెకానిక్ నిజాయితీ
అచ్యుతాపురం: విలువైన వస్తువులతో దొరికిన బ్యాగ్‌ను పోలీసులకు అప్పగించి బైక్ మెకానిక్ తన నిజాయితీ నిరూపించుకున్నారు. సీఐ గణేశ్ అందించిన వివరాలు.. అచ్యుతాపురం మండలం జంగులూరుకు చెందిన బైక్ మెకానిక్ రాజుకు శనివారం ఒక హ్యాండ్ బ్యాగ్ దొరికింది. అందులో తులం బంగారు వస్తువు, రూ.1750ల నగదు ఉన్నాయి. రాజు ఆ బ్యాగ్‌ను స్థానిక పోలీసులకు అప్పగించారు. దర్యాప్తు చేసిన పోలీసులు అప్పికొండ గ్రామానికి చెందిన మైలపల్లి భారతి పూడిమడక మార్గంలో కుటుంబంతో సహా వెళ్తుండగా బ్యాగ్ పోగొట్టుకున్నట్లు గుర్తించారు. వాస్తవం ధ్రువీకరించుకున్న అనంతరం భారతికి బ్యాగ్‌తో సహా నగదును, బంగారాన్ని పోలీసులు అప్పగించారు. నిజాయితీగా వ్యవహరించిన రాజును అభినందించిన సీఐ గణేశ్ ఐదు వందల రూపాయల నగదు బహుమతి అందజేశారు. స్థానిక సోషల్ మీడియాలో ఈ ఉదంతం వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment