చల్లగా చూడు.. గౌరమ్మ తల్లీ..
అనకాపల్లి: వేల్పులవీధి గౌరీపరమేశ్వరుల అమ్మవారి మహోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యా యి. శనివారం ఉదయమే ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవాలకు అంకుర్పారణ చేశారు. అమ్మవారి మహోత్సవానికి రెండు నెలల ముందుగా పట్ణంలో పలు ప్రాంతాల్లో నేలవేషాలు, స్టేజ్ ప్రొగ్రాములు, సంస్కృతిక కార్యక్రమాలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శనివారం తెల్లవారుజాము నుంచి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఉదయం 9 గంటలకు అమ్మవారి రథంపై ఉంచి పట్టణంలో పురవీధులు గుండా సోమవారం తెల్లవారు జాము వరకూ ఊరేగిస్తున్నారు. సాయంత్రం అమ్మవారి నేల వేషాలు నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారులు జనంతో కిక్కిరిసిపోయ్యాయి. ఈ మహోత్సవానికి సుమారుగా 3 లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు వాకాడ బాబు పర్యవేక్షించారు. అమ్మవారి ఉత్సవాన్ని పురస్కరించుకుని వేల్పులవీధిలో, అమ్మవారి ఆలయం వద్ద పలు సంఘాల ప్రతినిధులు పులిహోర, కిచిడి, సత్యనారాయణస్వామి ప్రసాదాలు ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉత్సవానికి వచ్చే భక్తులకు పంపిణీ ప్రసాదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment