స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛ దివస్ విజయవంతం చేయాలి
తుమ్మపాల: అందరి భాగస్వామ్యంతో స్వచ్ఛాంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమం విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం. జాహ్నవి తెలిపారు. ఈ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో శుక్రవారం ఆమె వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ప్రతి మూడో శనివారం ‘స్వచ్ఛాంధ్ర – స్వచ్ఛ దివస్‘ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ నెల 18న కడపలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కార్యక్రమం చేపట్టి అధికారులు, సిబ్బంది, ప్రజలు అంకితభావంతో భాగస్వాములు కావాలన్నారు. న్యూ ఇయర్ – క్లీన్ స్టార్ట్‘ థీమ్‌తో కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆస్పత్రుల పరిసరాలను శుభ్రం చేయాలన్నారు. గ్రామాల్లో చెత్త కుప్పల తొలగింపు, తాగు నీటి వసతుల క్లోరినేషన్, సామాజిక మరుగుదొడ్లను గుర్తించడం, వ్యక్తిగత మరుగుదొడ్లు ఉపయోగించేలా అవగాహన కల్పించడం, ఇంటింటా తడిచెత్త – పొడిచెత్త ప్రక్రియ కొనసాగించడం, వంటి పనులను చేపట్టాలన్నారు. జిల్లా పరిషత్, ముఖ్య కార్యనిర్వహకణాధికారి పి. నారాయణమూర్తి, జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్ జిల్లా కో ఆర్డినేటర్ ఇ. నాగలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి ఆర్. శిరీషా రాణి, నియోజకవర్గాల, మండలాల ప్రత్యేక అధికారులు, మండల అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ జాహ్నవి
Comments
Please login to add a commentAdd a comment