ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి బదిలీ చేయాలి
అనకాపల్లి: ఈ ఏడాది మే నెలలో సాధారణ బదిలీల్లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో విధులు నిర్వహిస్తున్న 1998 ఎంటీఎస్ ఉపాధ్యాయులను మైదాన ప్రాంతంలో పోస్టింగ్‌లు ఇవ్వాలని ఉమ్మడి విశాఖ జిల్లా 1998 ఎంటీఎస్ ఉపాధ్యాయ సంఘం నాయకులు పి.శ్రీనివాసరావు, పి.సుదర్శన్. పి.అప్పారావు కోరారు. స్థానిక మెయిన్‌రోడ్డు ఉపాధ్యాయ జూనియర్ కళాశాల ఆవరణలో శుక్రవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ పాలనలో 1998 డీఎస్సీ క్యాలీఫై అయిన ఉపాధ్యాయులకు ఉద్యోగం కల్పించారన్నారు. 2023 ఏప్రిల్‌లో జరిగిన బదిలీల్లో 1998 ఎంటీఎస్ ఉపాధ్యాయులను ఏజెన్సీలో నియమించారన్నారు. వీరంతా 50 సంవత్సరాలు పైబడినవారే కావడంతో ఏజెన్సీలో విధులు నిర్వహించాలంటే ఇబ్బందిగా ఉందన్నారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ విధులు నిర్వహిస్తున్నారని, కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుని మైదాన ప్రాంతానికి బదిలీ చేయాలని కోరారు. ఉద్యోగ భద్రత 62 సంవత్సరాలకు పెంచాలని, 12 నెలల వేతనం ఇవ్వాలని, పదవీ విరమణ తర్వాత మినిమం పింఛన్ అమలు చేయాలన్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లా 1998 ఎంటీఎస్ ఉపాధ్యాయ సంఘం నాయకులు
Comments
Please login to add a commentAdd a comment