కూటమి బెట్టింగ్‌ | - | Sakshi
Sakshi News home page

కూటమి బెట్టింగ్‌

Published Sat, Jan 18 2025 1:48 AM | Last Updated on Sat, Jan 18 2025 1:48 AM

కూటమి

కూటమి బెట్టింగ్‌

కనకమహాలక్ష్మి సన్నిధిలో న్యాయమూర్తులు
@140 కోట్లు!
బెట్టింగ్‌ రాయుళ్లు కూటమి నేతలే..!
సహకరిస్తున్న కూటమి ఎమ్మెల్యేలు?
‘పీఎం ఇంటర్న్‌షిప్‌’తో నైపుణ్యాభివృద్ధి

శనివారం శ్రీ 18 శ్రీ జనవరి శ్రీ 2025

యలమంచిలి రూరల్‌ : పట్టణంలోని ధర్మవరంలో కొలువుదీరిన కనకమహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో యలమంచిలి నాయస్థానాల న్యాయమూర్తులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయం పక్కనే న్యాయస్థానాల సముదాయం ఉంది. ఇటీవల అమ్మవారి మార్గశిర మాసోత్సవాలను ఉత్సవ కమిటీ వైభవంగా నిర్వహించింది. ఆదివారం అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యలమంచిలి సీనియర్‌ సివిల్‌ జడ్జి పి.విజయ, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి పి.స్వాతి, అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి టి.వీర రాఘవేంద్రరావు శుక్రవారం అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారికి పంచామృతాభిషేకం, పసుపు, కుంకుమలతో విశేష పూజలు నిర్వహించారు. వారికి ఆలయ ప్రధాన అర్చకుడు వెలవలపల్లి కుమార కోటేశ్వరశర్మ తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన న్యాయమూర్తులకు ఉత్సవ కమిటీ చైర్మన్‌ కొటారు సాంబ, సభ్యులు సాదరంగా ఆహ్వానం పలికారు.

80 అకౌంట్లను పరిశీలించిన పోలీసులు

ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నాలు

ఇంకా పరారీలోనే నిందితులు

కండువా కప్పి పార్టీలో చేర్చుకున్న పవన్‌, నాగబాబు

బెట్టింగ్‌లో కీలకంగా లగుడు రవి, బొబ్బిలి రవి

ఎవరీ కాకినాడ కార్తీక్‌...!

ఈ క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారంలో కీలకంగా ఉన్న కాకినాడ కార్తీక్‌ ఆచూకీ లభ్యం కాలేదు. కాకినాడకు వెళ్లి విచారించిన పోలీసులకు కార్తీక్‌ ఎవరనే విషయం మాత్రం బోధపడలేదని తెలుస్తోంది. కార్తీక్‌కు కాకినాడలో అనేక పేర్లతో వ్యవహారంలో ఉన్నాడని సమాచారం. ఒక్కొక్కరికి ఒక్కో పేరుతో కార్తీక్‌ పరిచయం కావడం గమనార్హం. అంతేకాకుండా పోలీసులు దర్యాప్తు కోసం వెళ్లే సమయానికే కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యారు. కార్తీక్‌కు విశాఖపట్నంతో పాటు హైదరాబాద్‌లో కూడా బెట్టింగ్‌ ముఠాతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. కార్తీక్‌ను కదిపితే బెట్టింగ్‌ మాఫియా వివరాలు మరిన్ని తెలిసే అవకాశం ఉంది.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా వ్యవహారంలో కూటమి నేతలదే కీలకపాత్ర అని తెలుస్తోంది. ప్రధాన నిందితులు లగుడు రవితో పాటు ప్రముఖ పాత్ర పోషిస్తున్న బొబ్బిలి రవి పరారీలో ఉన్నారు. వీరిద్దరూ జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారంలో విచారణ చేస్తున్న విశాఖ సిటీ పోలీసులు ఇప్పటి వరకు జరిగిన 80 బ్యాంకు అకౌంట్లను పరిశీలిస్తే కేవలం ఏడాది కాలంలోనే రూ.140 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. అయితే ఇంకా వందల్లో గుర్తించిన బ్యాంకు అకౌంట్లను పరిశీలించాల్సి ఉందని సమాచారం. వీటి లావాదేవీలను గమనిస్తే ఇంకా ఎన్ని వందల కోట్లకు చేరుతుందనేది ఊహకు కూడా అందడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

క్రికెట్‌ బెట్టింగ్‌లో కీలకంగా ఉన్న లగుడు రవితో పాటు బొబ్బిలి రవి జనసేన పార్టీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఇందులో బొబ్బిలి రవిని స్వయంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో పాటు నాగబాబు సమక్షంలో కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. వీరిని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ చేర్చడం గమనార్హం. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇక లగుడు రవి కూడా జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఇప్పటివరకు కేవలం లగుడు రవి ద్వారా వచ్చిన సమాచారంతో ఐదుగురిపై కేసులు నమోదు చేసిన సైబర్‌ క్రైం పోలీసులు.. తాజాగా మరో నలుగురిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. వీరి బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తే.. రూ.140 కోట్ల ఉండగా..ఇంకా మొత్తం అకౌంట్లు పరిశీలిస్తే ఇంకా ఎన్ని వందల కోట్లకు చేరుతుందోనని చర్చ సాగుతోంది.

ఇంకా లెక్కతేలాల్సిందే...!

వాస్తవానికి కొద్దిరోజుల క్రితం ఇసుకతోట, శివాజీపాలెం వద్ద జరుగుతున్న క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారంపై వచ్చిన సమాచారం మేరకు ఈ నెల 6వ తేదీన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు జరిపిన దాడిలో లగుడు రవి కుమార్‌ను అదుపులో తీసుకున్నారు. అనంతరం జరిపిన విచారణలో ఇందులో మరో వ్యక్తి బొబ్బిలి రవి, త్రినాథ్‌, జిలానీ, కాకినాడకు చెందిన కార్తీక్‌ల పాత్ర కూడా తేలింది. ఇందులో ఇప్పటికీ బొబ్బిలి రవితో పాటు మిగిలిన వ్యక్తులు అందరూ పరారీలోనే ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులు కూడా ఇళ్లు వదిలి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు లగుడు రవిని విచారించిన తర్వాత 80 బ్యాంకు అకౌంట్లను పరిశీలించగా... ఏడాది కాలంలోనే ఈ అకౌంట్ల ద్వారా రూ. 140 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు విశాఖ సిటీ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. అయితే బొబ్బిలి రవిని, కాకినాడకు చెందిన కార్తీక్‌ను కూడా అదుపులోకి తీసుకుంటే ఇంకా ఎన్ని వందల సంఖ్యలో బ్యాంకు అకౌంట్లు ఉన్నాయో తెలిసే అవకాశం ఉంది. ఇదే జరిగితే మొత్తం క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా జరిపిన ఒక్క ఏడాది లావాదేవీలే మరిన్ని వందల కోట్లు ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అదుపులోకి తీసుకోకుండా...!

సుమారు 10 రోజుల క్రితం జరిగిన సంఘటనలో బొబ్బిలి రవి, త్రినాథ్‌లను అదుపులోనికి తీసుకోకుండా ఉండేందుకు కూటమి ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేసినట్టు విమర్శలున్నాయి. కూటమికి చెందిన ఎమ్మెల్యేతో పాటు పీఏలు కూడా అరెస్టు చేయవద్దంటూ సిఫారసులు చేశారనే ఆరోపణలున్నాయి.

ఈ నేపథ్యంలోనే బొబ్బిలి రవి పరారీలో ఉన్నారు. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులను కూడా ఇంట్లో ఉండకుండా జాగ్రత్తపడినట్టు తెలుస్తోంది. మరోవైపు వీరికి ముందస్తు బెయిల్‌ కోసం కూడా కూటమి ఎమ్మెల్యేలు కొందరు ప్రయత్నిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇప్పటికే ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేశారని... ఇందుకోసం ఒక ఎమ్మెల్యే పీఏ ఒక్కో వ్యక్తి నుంచి రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ వసూలు చేశారనే ప్రచారం ఆ పార్టీల్లోనే జరుగుతోంది. ఇదిలావుండగా తెర వెనుక కూటమి ఎమ్మెల్యే చేస్తున్న వ్యవహారం నగర పోలీసు కమిషనర్‌ దృష్టికి వెళ్లడంతో వారి ఆటలు సాగడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ సాధ్యం కాదని, వారిని కచ్చితంగా అదుపులో తీసుకుంటామని విశాఖ సిటీ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

తుమ్మపాల : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉత్తమమైన ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి డాక్టర్‌ ఎన్‌.గోవిందరావు ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి, ఇంటర్‌ ఉత్తీర్ణత, ఐటీఐ, పా లిటెక్నిక్‌, బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ, బీ– ఫా ర్మా, బీటెక్‌ వంటి డిగ్రీలు పూర్తి చేసినవారు, చివరి సెమిస్టర్‌ చదువుతున్నవారు ఆన్‌లైన్‌లో httpr:// pminternship.mca.gov.in/ofin వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. 6 నుంచి 12 నెలల పాటు నిర్వహించే ఇంటర్న్‌షిప్‌లో 21 నుంచి 24 ఏళ్ల వయస్సు కలిగి యువత మాత్రమే అర్హులన్నారు. 500 మల్టీ నేషనల్‌ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. ఎంపికైన వారికి వన్‌టైమ్‌ గ్రాంట్‌గా రూ.6,000, ప్రతి నెలా రూ.4,500, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 500, పరిశ్రమల సీఎస్సార్‌ నిధుల ద్వారా ఆర్థిక సహాయం మొత్తం రూ.5000తోపాటు ప్రధానమంత్రి జీవిత బీమా యోజన, ప్రధానమంత్రి ప్రమాద బీమా యోజన వర్తిస్తుందన్నారు.

క్రషింగ్‌ కోసం చెరకు గడలను రైతులు సిద్ధం చేసుకున్నారు. బళ్లు ఎక్కించి గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీకి తరలించడానికి రెండు రోజుల క్రితమే ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే కార్మికుల నిరవధిక సమ్మె కారణంగా ఏర్పడిన ప్రతిష్టంభనతో ఎక్కడి వారు అక్కడ

ఆగిపోయారు. జీతభత్యాల బకాయిలు చెల్లిస్తే కానీ క్రషింగ్‌ పనులు

చేపట్టబోమని కార్మికులు భీష్మించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు

నిర్లక్ష్యం వహించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

హత్యాయత్నం కేసులో ఏడేళ్ల జైలు శిక్ష

సాక్షి, అనకాపల్లి: హత్యాయత్నం కేసులో ముద్దాయిలకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించారు. ఈమేరకు శుక్రవారం యలమంచిలి అసిస్టెంట్‌ సెషన్స్‌ కోర్టు జడ్జి పి.విజయ తీర్పు ఇచ్చారు. ఈ కేసులో నలుగురు ముద్దాయిలకు జైలు శిక్ష విధించారు. 2011 డిసెంబర్‌ 3వ తేదీన పాయకరావుపేట మండలం శ్రీరాంపురం గ్రామంలో నివసిస్తున్న ఫిర్యాదీ పులుగుల సన్యాసమ్మ, భర్త రామచంద్రరావుల ఇంటికి ముద్దాయిలు వచ్చి రాడ్డుతో కొట్టి హత్యాయత్నం చేశారు. ఏ 1 పులుగు సత్యవతికి, ఫిర్యాదీ భర్త రామచంద్రరావుల మధ్య వివాహేతర సంబంధం విషయమై గొడవపడి రాడ్డుతో కొట్టగా అప్పటి ఎస్సై జి.ప్రేమ్‌కుమార్‌ కేసు నమోదు చేసి ముద్దాయిలను అరెస్ట్‌ చేశారు. ఈ కేసు విచారణ పూర్తయిన తర్వాత శ్రీరామాపురం గ్రామానికి చెందిన ఏ 1 పులుగు సత్యవతి, ఏ 2 పులుగు రాంబాబు, ఏ 3 పులుగు బంగారి, ఏ 4 పిల్లా ప్రసాద్‌లకు ఏడేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ యలమంచిలి అసిస్టెంట్‌ సెషన్స్‌ కోర్టు తీర్పు ఇచ్చింది. దర్యాప్తు అధికారి అప్పటి ఎస్సై జి.ప్రేమ్‌కుమార్‌ను, పాయకరావుపేట పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది, కోర్టు మానిటరింగ్‌ సెల్‌ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరిచి, నిందితులకు శిక్ష పడే విధంగా దర్యాప్తు నిర్వహించిన అధికారులను ప్రశంసించారు.

క్రషింగ్‌కు

సమ్మెట పోటు

రెండ్రోజుల్లో క్రషింగ్‌ ప్రారంభిస్తాం: ఎండీ

కార్మికులకు కొంతమేర జీతభత్యాలు చెల్లించి, రెండ్రోజుల్లో రెగ్యులర్‌ క్రషింగ్‌ ప్రారంభిస్తామని ఫ్యాక్టరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.వి.సన్యాసినాయుడు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు, రావలసిన బకాయిలు సకాలంలో రాకపోవడం వల్లే కార్మికులకు, రైతులకు పాత బకాయిలు చెల్లింపుల్లో కొంత ఆలస్యమైందని, దీనిపై చర్యలు తీసుకున్నామని ఎండీ చెప్పారు.

చోడవరం: కార్మికుల నిరవధిక సమ్మె గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ మనుగడకు ముప్పుగా మారింది. వీరి సమ్మె ఈ ఏడాది క్రషింగ్‌ సీజన్‌ ప్రారంభంపై తీవ్ర ప్రభావం చూపింది. వాస్తవానికి ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న గోవాడ ఫ్యాక్టరీ మొదట్లో ఈ ఏడాది క్రషింగ్‌ చేపట్టాలా.. వద్దా అనే మీమాంసలో పడింది. అయితే యాజమాన్యం చొరవతో రైతుల నుంచి 1.70 లక్షల టన్నుల చెరకును సరఫరా చేసుకునేందుకు అగ్రిమెంట్లు వచ్చాయి. దీంతో క్రషింగ్‌కు సర్వం సిద్ధం చేసుకుంది. ప్రతి ఏటా డిసెంబరు రెండో వారంలోనే రెగ్యులర్‌ క్రషింగ్‌ను ప్రారంభించే ఫ్యాక్టరీ ఈ ఏడాది ఓవరాయిలింగ్‌ పనులు ఆలస్యం కావడంతో క్రషింగ్‌ ప్రారంభానికి కొంత సమయం తీసుకుంది. డిసెంబరు 25వ తేదీనే లాంఛనంగా క్రషింగ్‌ ప్రారంభించినప్పటికీ రెగ్యులర్‌ క్రషింగ్‌ సంక్రాంతి వెళ్లిన వెంటనే ఈనెల 16వ తేదీ నుంచి కొనసాగించడానికి యాజమాన్యం అన్ని చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన కటింగ్‌ పర్మిట్లు కూడా ముందుగానే ఇవ్వడంతో రైతులు కూడా చెరకు సరఫరా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో గత కొంతకాలంగా జీతభత్యాలు ఇవ్వకపోవడంతో వారం రోజుల నుంచి కార్మికులు దశలవారీగా ఆందోళనకు దిగారు. సంక్రాంతికి కొంతమేర చెల్లిస్తా మని యాజమాన్యం హామీ ఇవ్వడంతో రెగ్యులర్‌ క్రషింగ్‌ 16 నుంచి అనుకున్న సమయానికే ప్రారంభమవుతుందని అంతా భావించారు. అయితే నేటికీ బకాయిల్లో కొంత కూడా చెల్లించకపోవడంతో కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. వీరి సమ్మె ప్రభావం ఫ్యాక్టరీ రెగ్యులర్‌ క్రషింగ్‌పై పడింది.

ఎక్కడి బళ్లు అక్కడే..

రైతులు 16వ తేదీకే చెరకు సరఫరా చేసేందుకు చెరకు తోటలు నరికి బళ్లకు ఎక్కించి ఫ్యాక్టరీకి సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో క్రషింగ్‌ సమయానికి రెండ్రోజులు దాటినా కార్మికులు సమ్మెను విరమించకపోవడంతో క్రషింగ్‌ ప్రారంభం కాలేదు. దీంతో ఎక్కడి బళ్లు అక్కడే ఆగిపోయాయి. మొలాసిస్‌, పంచదార, అమ్మకాల వల్ల ప్రభుత్వం, విశాఖ డెయిరీ నుంచి సుమారు రూ.6 కోట్ల మేర బకాయిలు ఫ్యాక్టరీకి రావల్సి ఉంది. ఇవి రాకపోవడం వల్ల రైతులకు గత ఏడాదికి సంబంఽధించి టన్నుకు రూ.150, కార్మికులకు జీతభత్యాల కింద రూ.3 కోట్ల మేర చెల్లించడానికి ఫ్యాక్టరీ వద్ద డబ్బులు లేకపోయాయి. డబ్బులు రప్పించేందుకు చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు చొరవ చూపించకపోవడంతో సకాలంలో డబ్బులు రాలేదు. దీనిపై మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా పలుమార్లు అధికార పార్టీ ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ పరిణామం ఇప్పుడు ఫ్యాక్టరీ క్రషింగ్‌, మనుగడపై పడింది. ఇప్పటికే కటింగ్‌ పర్మిట్లు తీసుకొని చెరకు నరికి, సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్న రైతులు.. క్రషింగ్‌ రెండ్రోజుల్లో ప్రారంభించకపోతే ప్రైవేటు బెల్లం క్రషర్లకు పంపించాలని ఆలోచిస్తున్నారు. ఇదే గాని జరిగితే ఈ ఏడాది ఫ్యాక్టరీ క్రషింగ్‌ ఆదిలోనే మూలకు చేరే పరిస్థితి నెలకొంటుంది. ఈ ఏడాది క్రషింగ్‌ చేయకపోతే వచ్చే సీజన్‌కు ఫ్యాక్టరీని మూసేసే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటే సుమారు వెయ్యి మంది కార్మిక కుటుంబాలు, 23 వేల మంది రైతుల కుటుంబాలు జీవనాధారం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికై నా రావలసిన పాత బకాయిలు వసూలు చేయడంలో అధికార పార్టీ ఎమ్మెల్యే చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా కొంత మేర అయినా కార్మికులకు జీతభత్యాలు ఇచ్చి వెంటనే వారిని విధుల్లోకి తెచ్చి క్రషింగ్‌ ప్రారంభించేలా యాజమాన్యం కూడా మరింత శ్రద్ధ పెట్టాలి. ఎవరు నిర్లక్ష్యం చేసినా ఫ్యాక్టరీ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని రైతులు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా కార్మికుల సమ్మె వ్యవహారం చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజు వద్దకు చేరింది. యాజమాన్యం, కార్మికులతో ఎమ్మెల్యే సమావేశమై సమ్మె విరమించాలని కోరారు. అయితే కార్మికులు మాత్రం కొంతైనా బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

న్యూస్‌రీల్‌

నేడు ‘నవోదయ’ ప్రవేశ పరీక్ష

మాడుగుల: ఉమ్మడి విశాఖ జిల్లాలో జవహర్‌ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష శనివారం జరగనుందని జవహర్‌ నవోదయ విద్యాలయం (కొమ్మాది) ప్రిన్సిపాల్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. మాడుగుల మండలం ఘాట్‌రోడ్‌ జంక్షన్‌లో శుక్రవారం ఆయన సాక్షితో మాట్లాడారు. శనివారం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరగనుందన్నారు. పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించేందుకు ఇప్పటికే మూడు జిల్లాల పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లకు, పరిశీలకులకు మూడు జిల్లాల డీఈవో కార్యాలయాల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ ఏడాది ప్రవేశ పరీక్ష రాసేందుకు 9,080 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. విశాఖ జిల్లాలో 20 పరీక్ష కేంద్రాలు, అనకాపల్లి జిల్లాలో 15 కేంద్రాలు, అల్లూరి జిల్లాలో 4 పరీక్ష కేంద్రాలు మొత్తం 39 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, కేంద్ర స్థాయి పరిశీలకులు పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారన్నారు. నవోదయ విద్యాలయం ద్వారా మొబైల్‌ స్క్వాడ్స్‌ కూడా ఏర్పాటు చేశామన్నారు. ఆయన వెంట ఎగ్జామినేషన్‌ ఇన్‌చార్జి జి.భక్తవత్సలం కూడా ఉన్నారు.

నేడు జెడ్పీ స్థాయీ సంఘం, సర్వసభ్య సమావేశాలు

మహారాణిపేట (విశాఖ): జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జె.సుభద్ర అధ్యక్షతన స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్టు జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఉదయం 9.00 నుంచి 10.30 గంటల వరకు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు జరుగుతాయని పేర్కొన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ చాంబర్‌ సమీపంలోని వీసీ హాలులో, జెడ్పీ సమావేశ మందిరంలో ఒకటి నుంచి ఏడు వరకు గల స్థాయీ సంఘ సమావేశాలు వేర్వేరుగా ఉదయం నుంచి నిర్దేశిత సమయాల్లో జరుగుతాయని చెప్పారు. ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, ఎంపీపీలు, అధికారులు ఈ సమావేశాలకు హాజరుకావాలని కోరారు. ఉదయం 10.30 గంటల నుంచి సర్వసభ్య సమావేశం కొనసాగుతుందని, జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు పూర్తి నివేదికలతో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

బకాయిల కోసం గోవాడ సుగర్స్‌ కార్మికుల సహాయ నిరాకరణ క్రషింగ్‌ ప్రారంభం కాకపోవడంతో చెరకు రైతుల్లో ఆందోళన ఆలస్యమైతే బెల్లం క్రషర్లకు చెరకు తరలిపోయే ప్రమాదం బకాయిలు రాబట్టడంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు విఫలం

వాతావరణం

అనకాపల్లి: రాగల ఐదు రోజులు ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఆర్‌ఏఆర్‌ఎస్‌ వాతావరణ విభాగం శాస్త్రవేత్త వి.గౌరి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు ఈనెల 18న 17.3 డిగ్రీలు, 19న 17.3, 20న 16.8, 21న 16.9, 22న 16.8 డిగ్రీలు నమోదవుతాయని, గాలి గంటకు 2 నుంచి 3 కిలోమీటర్ల వేగంతో వీస్తుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కూటమి బెట్టింగ్‌ 1
1/5

కూటమి బెట్టింగ్‌

కూటమి బెట్టింగ్‌ 2
2/5

కూటమి బెట్టింగ్‌

కూటమి బెట్టింగ్‌ 3
3/5

కూటమి బెట్టింగ్‌

కూటమి బెట్టింగ్‌ 4
4/5

కూటమి బెట్టింగ్‌

కూటమి బెట్టింగ్‌ 5
5/5

కూటమి బెట్టింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement