మూడు నెలల్లో 30,440 లీటర్ల పులుపు ధ్వంసం
నర్సీపట్నం: ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక నిఘా తో నర్సీపట్నం సర్కిల్ పరిధిలో సారా నిర్మూలనకు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. నర్సీపట్నం, మాకవరపాలెం, కోటవురట్ల, రోలుగుంట మండలాల్లోని సారా బట్టీలపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. పెదబొడ్డేపల్లి, పెదపేట కొంతలం, ధర్మసాగరం తదితర గ్రామాలపై గట్టి నిఘా పెట్టారు. సారాతో పట్టుబడిన నిందితుడిపైనే కాకుండా తయారీదారులపై అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. సారా తయారీకి మూలమైన నల్లబెల్లం విక్రయాలు అధికంగా జరిపిన వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ మూడు నెలల కాలంలో 112 కేసులు నమోదు చేసి 115 మందిని అరెస్టు చేశారు. 114 లీటర్ల సారాను సీజ్ చేశారు. 30,440 లీటర్ల బెల్లం పులుపును ధ్వంసం చేశారు. 113 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. సారా వృత్తిగా జీవించే వారి కుటుంబాలను గుర్తించి, వారికి ప్రభుత్వం నుంచి ఉపాధి అవకాశాలు కల్పిచేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు నర్సీపట్నం ఎకై ్సజ్ సీఐ సునీల్ కుమార్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment