శతశాతం లక్ష్యాలు పూర్తి చేయాలి
డీఎంహెచ్‌వో రవికుమార్
అచ్యుతాపురం: ఆరోగ్య,వైద్య శాఖకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను,లక్ష్యాలను శతశాతం పూర్తి చేయాలని జిల్లా వైద్య,ఆరోగ్య శాఖాధికారి పి.రవి కుమార్ ఆదేశించారు.అచ్యుతాపురం మండలం హరిపాలెం పీహెచ్‌సీని ఆయన శనివారం ఆకస్మికంగా సందర్శించారు.రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మందుల నిల్వ, టీకాల లభ్యత వివరాలు తెలుసుకున్నారు.పెదపాడులో నిర్వహిస్తున్న ఎఫ్‌డీపీ కార్యక్రమాన్ని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి విజయ్, ఆరోగ్య విస్తరణాధికారి శ్రీనివాస్,ఆరోగ్య బోధకులు రామలక్ష్మి,ఆరోగ్య పర్యవేక్షకులు సునీత,ఉమా మహేశ్,సిబ్బంది గణేశ్,శాంతి తదితరులు పాల్గొన్నారు.
సబ్ సెంటర్ సందర్శన ..
మునగపాక: మండలంలోని చూచుకొండ పీహెచ్‌సీ పరిధిలోని తిమ్మరాజుపేట సబ్‌సెంటర్‌ను శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి పి.రవికుమార్ సందర్శించారు. కేంద్రంలోని మందుల విభాగాన్ని పరిశీలించి, రికార్డులు తనిఖీ చేశారు. కేంద్రం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ సబ్‌సెంటర్‌కు వచ్చే ప్రతి ఒక్కరికీ సకాలంలో సేవలందించేలా వైద్యసిబ్బంది కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ప్రజలకు ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలవుతున్న పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఆయన వెంట హెచ్‌ఎస్ లక్ష్మణ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment