రేపటి నుంచి కుష్ఠువ్యాధిపై ఇంటింటి సర్వే
అనకాపల్లి: జాతీయ కుష్ఠువ్యాధి నిర్మూలన కార్యక్రమాన్ని ఈనెల 20 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకూ నిర్వహించనున్నట్టు డీఎంహెచ్‌వో పడాల రవికుమార్ తెలిపారు. స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి ఆవరణలో జిల్లాలో పీహెచ్‌సీ, సీహెచ్‌సీల వైద్య సిబ్బందికి శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో విడత కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు చెప్పారు. వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరీక్షించి, ఎవరికైనా కుష్ఠువ్యాధి లక్షణాలు ఉన్నట్టయితే సకాలంలో వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంతకుముందు డిజిటల్ బోర్డుపై వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కుష్టువ్యాధి నిర్మూలన అధికారి ఎం.ఎస్.వి.కె.బాలాజీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment