ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య
మాకవరపాలెం: ప్రేమించిన యువతి దక్కదన్న మనస్తాపంతో ఓ ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మండలంలోని బూరుగుపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ గ్రామానికి చెందిన గూనూరు భరత్(22) ఏడాది క్రితం అగ్నివీర్ ఎంపికల్లో ఆర్మీ ఉద్యోగం పొందాడు. ఐదు నెలల కిందట శిక్షణ ముగించుకుని, వెస్ట్ బెంగాల్ లో ఉద్యోగం చేస్తున్నాడు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని ఓలాడ్జీలో ఆత్మహత్య చేసుకున్నట్టు శనివారం కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఓ యువతిని ప్రేమించానని, ఆమెకు వేరే యువకుడితో వివాహం చేస్తుండడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు స్నేహితులకు తెలిపినట్టు స్థానికులు తెలియజేశారు. మృతుడి తల్లి మరణించగా, తండ్రి తాతారావు బూరుగపాలెంలో కూలి పనులు చేస్తుంటాడు. చేతికి అంది వచ్చిన కొడుకు మృతితో తండ్రి భోరున విలపిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment