రూ.40 లక్షల విలువైన పశుమాంసం పట్టివేత
నక్కపల్లి: పశ్చిమ బెంగాల్‌లోని రాణిగంజ్ నుంచి హైదరాబాద్ తరలిస్తున్న పశుమాంసాన్ని సోమవారం నక్కపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ సన్నిబాబు తెలిపిన వివరాలు.. రాణిగంజ్ నుంచి ఐషర్ వ్యాన్‌పై పశుమాంసం అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో వేంపాడు జంక్షన్‌లో ఎస్‌ఐ తన సిబ్బందితో కలసి వాహనాలు తనిఖీ చేశారు. వ్యాన్ కంటెయినర్ లోపల 1400 ప్యాకెట్లలో రోల్స్‌గా తయారు చేసిన 23 వేల కిలోల పశుమాంసాన్ని గుర్తించారు. ఈపశు మాంసాన్ని రాణిగంజ్ సమీపంలో జల్‌పాయి వద్ద వ్యాన్‌లో లోడ్ చేసినట్లు వ్యాన్ సిబ్బంది తెలిపారన్నారు. పట్టుబడ్డ పశుమాంస విలువ సుమారు రూ.40 లక్షలు ఉంటుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన డ్రైవర్ నౌసాద్ అలీని అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ తనిఖీల్లో చినదొడ్డిగల్లు వెటర్నరీ సిబ్బంది, వీఆర్వోలు పాల్గొన్నారన్నారు.
ప్యాకెట్ల రూపంలో 23 వేల కిలోల మాంసం
పశ్చిమ బెంగాల్ నుంచి హైదరాబాద్‌కు తరలించేందుకు యత్నం
Comments
Please login to add a commentAdd a comment