పీఎం ఇంటర్న్‌షిప్‌కు నేడు తుది గడువు
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న జేసీ జాహ్నవి
తుమ్మపాల:
పీఎం ఇంటర్న్‌షిప్ పథకానికి మంగళవారం లోగా నిరుద్యోగులు నమోదు చేసుకోవాలని ఎం.జాహ్నవి తెలిపారు. సోమవారం కలెక్టరు కార్యాలయంలో పీఎం ఇంటర్న్‌షిప్ పథకం పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాధ్యమైనంత ఎక్కువ మంది యువత ఈ పథకాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్.గోవిందరావు మాట్లాడుతూ ప్రతి ఇంటర్న్‌కు 12 మాసాల పాటు శిక్షణ ఇస్తూ, నెలవారీ సహాయం కింద రూ.4,500 పరిశ్రమల ద్వారా రూ.500, సంఘటనల కోసం రూ.6 వేలు వన్–టైమ్ గ్రాంట్ మంజూరు చేస్తామన్నారు. శిక్షణ కాలంలో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద బీమా కవరేజీ వర్తిస్తుందని తెలిపారు. ఇంటర్న్ షిప్ అనంతరం ప్రతిష్టాత్మకమైన కంపెనీల్లో ఉపాధి అవకాశం కల్పిస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మంగళవారం రాత్రి లోపు httpr://pminternship.mca.gov.in/login/ లింకులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్ వంటి డిగ్రీలు పూర్తి చేసిన 21 నుంచి 24 సంవత్సరాలలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 9010793492కు సంప్రదించవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment