అంతర్జాతీయ ఖోఖో రిఫరీ శ్రీనివాసరావుకు సత్కారం
శ్రీనివాసరావును సత్కరిస్తున్న తుమ్మపాల గ్రామపెద్దలు, ప్రజలు
అనకాపల్లి: న్యూఢిల్లీలో ఈ నెల 13 నుంచి 19వ తేదీ వరకూ జరిగిన ప్రథమ ఖో–ఖో వరల్డ్ కప్ పోటీల్లో రిఫరీగా వ్యవహరించిన అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామానికి చెందిన సీహెచ్.ఎల్.ఎం.శ్రీనివాసరావును గ్రామస్తులు సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ పోటీలు విజయవంతంగా ముగిసి తిరిగి స్వగ్రామానికి వచ్చిన ఆయనకు ఘన స్వాగతం పలికారు. శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ 44 సంవత్సరాలుగా ఖో–ఖో క్రీడలో ఉన్నానని, 18 నేషనల్ ఖో – ఖో టోర్నమెంట్ పోటీల్లో గెలుపొందామన్నారు. 24 సంవత్సరాలుగా జాతీయ, అంతర్జాతీయ ఖో–ఖో టోర్నమెంట్లలో రిఫరీగా వ్యవ హరిస్తున్నానన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన తాను ప్రపంచ టోర్నమెంట్లో రిఫరీగా పని చేయడం ఆనందంగా ఉందన్నారు. నేటి యువత సెల్‌ఫోన్లకు పరిమితం కాకుండా క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. కష్టాన్ని నమ్ముకుని పనిచేసిన ప్రతి వ్యక్తికీ గుర్తింపు ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment