వీఆర్వోల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శంకరరావు
నియామక పత్రం అందుకుంటున్న శంకరరావు
దేవరాపల్లి: వీఆర్వోల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా దేవరాపల్లి మండలం ఎం. అలమండ గ్రామానికి చెందిన పోతల శంకరరావు నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం విజయవాడలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఈర్లె శ్రీరామమూర్తి, రాష్ట్ర అధ్యక్షుడు కోన ఆంజనేయకుమార్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ జి.అనుపమల నుంచి ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. బుచ్చెయ్యపేట మండల పి.భీమవరం వీఆర్వోగా పని చేస్తున్న శంకరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని వీఆర్వోల సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment