ఎమ్మెల్సీ స్థానానికి మూడు నామినేషన్లు
మహారాణిపేట: ఉత్తరాంధ్ర పరిధిలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మంగళవారం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్‌కు అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం ఆర్వో సమక్షంలో ప్రమాణం చేశారు. ఏపీటీఎఫ్ మద్దతుదారుగా బరిలోకి దిగిన పాకలపాటి రఘువర్మ రెండు సెట్ల నామినేషన్ పత్రాలు అందజేయగా, కోసూరు రాధాకృష్ణ, సత్తలూరి శ్రీరంగ పద్మావతి ఒక్కో సెట్ పత్రాలను ఆర్వోకు సమర్పించారు. రఘువర్మ వెంట ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, మద్దతుదారులు తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment