అనంతపురం మెడికల్: ప్రభుత్వ వైద్య కళాశాల 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2025, ఏప్రిల్ రెండో వారంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించబోతున్నట్లు వైద్య కళాశాల ప్రిన్సిపాల్, డీన్ డాక్టర్ మాణిక్య రావు తెలిపారు. వేడుకల నిర్వహణపై సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కమిటీ సభ్యులతో గురువారం వైద్య కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన సంఘం సభ్యులు సమావేశమై చర్చించారు. డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. సిల్వర్ జూబ్లీ వేడుకలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రముఖులు, క్రీడ, వైద్య ప్రముఖులను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. మూడ్రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయన్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎంబీబీఎస్ విద్య పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులు అందరూ తప్పనిసరిగా పూర్వ విద్యార్థుల సంఘంలో సభ్యత్వం తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సభ్యత్వం కోసం రూ.5వేలను కనీస రుసుముగా నిర్ణయించారు. సమావేశంలో వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ షారోన్ సోనియా, పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు డాక్టర్ ఆత్మారాం, డాక్టర్ మధుసూదన్, డాక్టర్ చైతన్య, డాక్టర్ నీలిమ, డాక్టర్ శ్రీహర్ష, సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ కమిటీ సభ్యులు డాక్టర్ దుర్గ, డాక్టర్ భీమసేనాచార్, డాక్టర్ వేముల శ్రీనివాసులు, డాక్టర్ శైలజ, డాక్టర్ స్వాతి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఆదిరెడ్డి పరదేశీ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment