వైద్య ఆరోగ్య శాఖలో ఆయనో చిరుద్యోగి. తనకన్నా ఉన్నత స్థాన
పేరు ః ఉడమాల నారాయణస్వామి
బ్యాంక్ ః స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తాడిపత్రి బజార్ బ్రాంచ్
ఖాతా నంబర్ ః 1109 307 5181
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ః SBIN0004189
ఫోన్‌పే నంబర్ @ 93912 14490
● మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థి
● శస్త్రచికిత్సకు రూ.10 లక్షలవుతుందన్న వైద్యులు
● దాతల సాయం కోసం ఎదురు చూపు
● ఆదుకోవాలని ప్రభుత్వానికి వేడుకోలు
సాయం చేయదలిస్తే..
యాడికి: తాడిపత్రిలో నివాసముంటున్న నారాయణస్వామి యాడికి మండలం రాయలచెరువులోని పీహెచ్‌సీలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు ఎలాంటి స్థిరాస్తులు లేవు. కేవలం జీతంపైనే ఆధారపడి కుమార్తెను, కుమారుడిని చదివించుకుంటూ వచ్చారు. కుమారుడు గోపీకృష్ణ తనకంటే ఉన్నత స్థానంలో ఉండాలని కలలు కన్న ఆయన ఆ కలను సాకారం చేసుకునేందుకు అహర్నిశలు శ్రమించారు. తండ్రి ఆశలను వమ్ము చేయకుండా గోపీకృష్ణ సైతం పట్టుదలతో చదువుకుని నీట్‌లో ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం కర్నూలు జిల్లా గూడూరు మండలం పెంచికలపాడులోని విశ్వభారతి వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఆఖరి సంవత్సరం అభ్యసిస్తున్నాడు. కుమారుడి చదువులు, కుమార్తె పెళ్లి కోసం నారాయణస్వామి అప్పులు చేశాడు.
విశ్వభారతి వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఆఖరి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈనెల 9వ తేదీ రాత్రి కళాశాల హాస్టల్‌లో భోజనం చేసి తన స్నేహితుడు వైఎస్సార్ జిల్లాకు చెందిన సాయిమణితో కె.నాగలాపురం వద్ద ఉన్న రూముకు ద్విచక్ర వాహనంపై గోపీకృష్ణ బయలుదేరాడు. పెంచికలపాడు పత్తి మిల్లు వద్దకు చేరుకోగానే ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే కర్నూలులోని సర్వజనాస్పత్రికి తరలించారు. విద్యార్థులు అపస్మారక స్థితిలో ఉండడంతో ప్రమాదం ఎలా జరిగిందనే విషయం తెలియరాలేదు.
ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చొని ప్రయాణిస్తున్న గోపీకృష్ణకు ప్రమాదంలో ముఖంపై ఉన్న ఎముకలన్నీ విరిగిపోయాయి. కొన్ని నుజ్జునుజ్జయ్యాయి. సమాచారం అందుకున్న నారాయణస్వామి ఆగమేఘాలపై కర్నూలులోని సర్వజనాస్పత్రికి చేరుకున్నాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న గోపీకృష్ణను చూడగానే ఆయన దుఃఖం కట్టలు తెంచుకుంది. కుమారుడిని ఎలాగైనా బతికించుకోవాలనుకున్న ఆయన వెంటనే స్థానిక ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు... గోపీకృష్ణను మాములు మనిషిని చేయాలంటే శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. ప్రస్తుతం ఐసీయూలో అందజేస్తున్న చికిత్సకు రోజుకు రూ.30 వేల ఖర్చు వస్తోంది. అప్పు చేసి తనతో పాటు తీసుకెళ్లిన రూ.3 లక్షలను ఆస్ప్రతి నిర్వాహకులకు నారాయణస్వామి చెల్లించాడు. శస్త్రచికిత్స అనంతరం మరో నెల రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని వైద్యులు తెలిపారు. ఇందుకు రూ.10 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని తెలిపారు. అంత పెద్దమొత్తంలో డబ్బు సమకూర్చడం తలకు మించిన భారం కావడంతో దాతల ఆర్థిక సాయాన్ని ఆర్థిస్తున్నాడు. ప్రభుత్వం, దాతలు మానవతా దృక్పథంతో ఆదుకుని తన కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని కోరుతున్నాడు.
ముఖం ఛిద్రమై..
క్షణాల్లోనే జరిగిపోయింది..
Comments
Please login to add a commentAdd a comment