హిందీ పండిట్ ఆత్మహత్య
రాయదుర్గంటౌన్: మండల పరిధిలోని టి.వీరాపురం గ్రామంలోని జెడ్పీ హైస్కూల్‌లో హిందీ పండిట్‌గా పనిచేస్తున్న పురంధర దాసు(46) శనివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని బంధువులు తెలిపిన వివరాలమేరకు... డీ.హీరేహాళ్ మండలం పూలకుర్తి గ్రామానికి చెందిన పురంధర రాయదుర్గం పట్టణంలోని గ్యాస్ గోడౌన్ ఏరియాలో నివాసం ఉంటున్నాడు. భార్య సుజాత మండలంలోని పల్లేపల్లి గ్రామంలో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తోంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అయితే తాగుడుకు బానిసైన పురంధర విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి పాఠశాలకు వెళ్లకుండా గైర్హాజరవుతున్నాడు. అయితే రాయదుర్గం పట్టణంలోని రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉన్న ఓ చింత తోపులో చెట్టుకు ఉరివేసుకుని పురంధర ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో గమనించి స్థానికులు పోలీసులకు సమచారం అందజేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఉరేసుకొని మహిళ ఆత్మహత్య
రాయదుర్గంటౌన్: ఉరివేసుకుని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని టి.వీరాపురం గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ బాలరాజు తెలిపిన వివరాలమేరకు... టి. వీరాపురానికి చెందిన సువర్ణమ్మ (38) భర్త శ్రీరాములు ఆరేళ్ల క్రితమే చనిపోయాడు. సువర్ణమ్మ గ్రామంలోనే ఓ కిరాణ చిల్లరకొట్టును నడుపుతూ జీవనం సాగిస్తోంది. ఆమెకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. శుక్రవారం సాయంత్రం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆమెను కించపరిచే విధంగా మాట్లాడారు. మనస్తాపానికి గురైన సువర్ణమ్మ ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందింది. మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించి ఈ ఘటనపై బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బాలరాజు తెలిపారు.
కారును ధ్వంసం చేసిన
టీడీపీ మూకలు
ధర్మవరం రూరల్: మండల పరిధిలోని ఓబుళనాయనపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు గంగాధర్‌నాయుడుకు చెందిన కారు (స్కార్పియో)ను శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇంటి ఆవరణలో ఉంచిన స్కార్పియోను అర్ధరాత్రి సమయంలో రాళ్లతో ధ్వంసం చేశారని గంగాధర్‌నాయుడు తెలిపారు. గ్రామానికి చెందిన టీడీపీ మూకలే ఈ పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment