అమ్మ కోసం పోలీసులను ఆశ్రయించిన చిన్నారులు
అమ్మ.. అనే రెండక్షరాల పదం అనురాగ చిహ్నం, ఆత్మీయతకు
సంకేతం, భాషకు అందని భావం... అయితే ఓ మహిళ తీసుకున్న నిర్ణయం అమ్మతనానికి తలవంపులు తెచ్చింది. ఏకంగా కన్న బిడ్డలను రోడ్డుపై పడేలా చేసింది. నువ్వే కావాలమ్మా అంటూ ఆ బిడ్డలు పడుతున్న వేదనను చూసి అంతా కరిగిపోతున్నా ఆ తల్లి హృదయం మాత్రం కరగడం లేదు. – తాడిపత్రిటౌన్:
తాడిపత్రి పట్టణంలోని పోరాట కాలనీలో నివాసం ఉంటున్న లక్ష్మీనారాయణమ్మ, రంగనాయకుల దంపతులకు ముగ్గురు కుమార్తెలు మేఘన (15), మేఘన, సుష్మ (మొదటి ఇద్దరి పేర్లు మేఘనానే) ఉన్నారు. భార్యాభర్తలు వీధి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. అయితే ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో రంగనాయకులు మృతి చెందాడు. వీధి వ్యాపారంతో పాటు చిన్నపాటి కూలి పనులు చేసుకుంటూ లక్ష్మీనారాయణమ్మ బిడ్డలను చదివించేది. అయితే తాడిపత్రిలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడంతో అక్కడి పనులకు వెళ్లిన లక్ష్మీనారాయణమ్మ ఓ యువకుడి ప్రేమలో పడింది. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకొని వేరే కాపురం పెట్టారు. వారి జీవితానికి పిల్లలు అడ్డంకిగా మారడంతో వారిని వదిలి మరోచోట ఇల్లు అద్దెకు తీసుకొని పిల్లలను పట్టించుకోవడం మానేశారు. దాదాపు మూడు నెలలుగా పిల్లల బాగోగులను బంధువులు చూస్తూ వస్తున్నారు. పిల్లలు, బంధువులు ఎంత బతిమలాడినా లక్ష్మీనారాయణమ్మ రాకపోవడంతో పిల్లలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ‘సార్ .. అమ్మ కావాలంటూ’ ప్రాధేయపడ్డారు. ఈ సమస్య ఎలా పరిష్కరించాలో అర్థంకాక పోలీసులు సందిగ్ధంలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment