రైలు ఢీకొని వృద్ధురాలి దుర్మరణం
అనంతపురం సిటీ: అనంతపురం రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలోని గార్లదిన్నె – కల్లూరు మార్గమధ్యంలో రైలు ఢీకొని శనివారం మధ్యాహ్నం ఓ వృద్ధురాలు (75) మృతి చెందినట్లు జీఆర్‌పీ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఊరు, పేరు తెలియని వృద్ధురాలి కాళ్లు, చేతులకు బలమైన గాయాలైనట్లు పేర్కొన్నారు. మృతురాలి ఒంటిపై బ్లూకలర్ చీర మాత్రమే ఉందన్నారు. తమకు సమాచారం అందిన వెంటనే సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం తరలించామని చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆచూకీ తెలిసిన వారు సెల్: 94414 45354కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
హోరాహోరీగా
షూటింగ్ బాల్ పోటీలు
ఆత్మకూరు: రాష్ట్రస్ధాయి 7వ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ షూటింగ్ బాల్ చాంపియన్ షిప్ పోటీలు శనివారం మండలంలోని తలుపూరు గ్రామ ఉన్నత పాఠశాలలో హోరాహోరీగా జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు 11 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చిన్న గ్రామాల్లోనూ రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు షూటింగ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాముడు తెలియజేశారు. 11 జట్లకు పోటీలు నిర్వహించగా శ్రీసత్యసాయి, కృష్ణ, అన్నమయ్య, నెల్లూరు జిల్లాలు సెమీస్‌కు చేరుకున్నాయన్నారు. ఆదివారం సెమీస్, ఫైనల్ నిర్వహిస్తామని చెప్పారు. ప్రతిభ కనబరచిన క్రీడాకారులు జనవరి 2వ తేదీన పూరిలోని జగన్నాథ స్టేడియంలో జరిగే జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment