లేపాక్షి: మండలంలోని పులమతి ఆంజనేయస్వామి విగ్రహం వద్ద ఉన్న హుండీలోని నగదును ఓ దొంగ ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. స్థానికుల వివరాలమేరకు... పులమతి గ్రామ సమీపంలో ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. ఆ విగ్రహం ముందు హుండీని కూడా ఏర్పాటు చేశారు. అయితే శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఆంజనేయ విగ్రహం వద్ద పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు ఆ పరిసరాలను గమనించారు. ఆంజనేయస్వామి విగ్రహం ముందున్న హుండీలోని కానుకలను తీసి లెక్కిస్తుండటాన్ని చూశారు. వెంటనే దొంగను పట్టుకొని హుండీలోని రూ.18 వేల నగదును స్వాధీనం చేసుకొని అతన్ని పోలీసులకు అప్పగించారు. దొంగ కర్ణాటకకు చెందిన హరీష్‌గా పోలీసుల విచారణలో తేలింది. మరిన్ని వివరాలు పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment