ఘనంగా బాబయ్య స్వామి గంధం వేడుక
పెనుకొండ: ప్రసిద్ధి గాంచిన పెనుకొండ బాబయ్య స్వామి గంధం వేడుకలు వైభవంగా జరిగాయి. డప్పు వాయిద్యాలు, ఫక్కీర్ల విన్యాసాల నడుమ శనివారం తెల్లవారుజాము 2 గంటలకు దర్గా పీఠాధిపతి తాజ్‌బాబా గంధంను తలపై ఉంచుకుని ఇంటి బయలు దేరారు. తెల్లవారుజాము 5 గంటలకు బాబయ్య స్వామి సమాధి వద్దకు చేరుకుని గంధంసమర్పించారు. అనంతరం మత పెద్దలతో కలసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అంతకుముందు జరిగిన సర్వమత సమ్మేళనంలో వివిధ మతాల పెద్దలు పాల్గొన్నారు. ప్రపంచ శాంతి కోసం అందరూ పాటు పడాలని పిలుపునిచ్చారు. కాగా గంధం వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో పెనుకొండ కిటకిటలాడింది. ఉర్సు సందర్భంగా బాబయ్య స్వామి దర్గాను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
Comments
Please login to add a commentAdd a comment