● ఎమ్మెల్యే పరిటాల సునీత,
అనుచరులు బెదిరిస్తున్నారు
● మద్యం షాపుల లైసెన్స్‌దారుల ఆవేదన
పంజగుట్ట (హైదరాబాద్): అనంతపురం జిల్లాలో మంజూరైన మద్యం షాపులు నడిపించుకోకుండా టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, అనుచరులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు కృష్ణా జిల్లా నందిగామకు చెందిన మేడ గోపి, కె.గురునాథం శనివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మద్యం టెండర్లలో తాము మొత్తం 25 షాపులకు టెండర్ వేశామన్నారు. గోపికి అనంతపురంలో రెండు షాపులు (ఏటీ–100, ఏటీ–97), రాప్తాడులో ఒకటి (ఎస్‌ఎస్–22), గురునాథంకు అనంతపురంలో ఒకటి (ఏటీ–89), తాడిపత్రిలో ఒక షాపు (ఏటీ–93) దక్కాయన్నారు. ఒక్కో షాపునకు రూ.20 లక్షల చొప్పున ఎకై ్సజ్ డ్యూటీ చెల్లించామన్నారు. షాపు రూములను కూడా అద్దెకు తీసుకున్నామన్నారు. కానీ ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరులు గుంపుగా వచ్చి తమను తీసుకెళ్లి తీవ్ర భయ భ్రాంతులకు గురిచేశారని, షాపులు నడిపితే చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. ఎక్కడైనా టెండర్లు వేసుకోవచ్చునంటూ పేర్కొని తీరా షాపులు మంజూరయ్యాక బెదిరించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. పెట్టుబడి పెట్టి రెండు నెలలుగా షాపులు నడిపించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎకై ్సజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర, హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు జిల్లా కలెక్టర్‌కూ లేఖలు రాశామని, అయినా ఎలాంటి స్పందనా లేదని తెలిపారు. కేవలం రెండు లక్షల రూపాయలు ఇస్తాము.. తప్పుకోండని అంటున్నారని, ఇదెక్కడి న్యాయ మని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి తగిన భద్రత కల్పించి.. తాము షాపులు నడిపించుకునే అవకాశం కల్పించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment