అనంతపురం అర్బన్: జిల్లాలో ప్రాజెక్టుల పూర్తికి చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 544డీ, 67, 544డీడీ, 42, 150ఏ జాతీయ రహదారులు, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో, ఏపీఐఐసీ, రైల్వేస్, తదితర ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ, పరిహారం పంపిణీ, పనులు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. భూ సేకరణలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలసత్వానికి తావివ్వకూడదని చెప్పారు. ఏపీఐఐసీ పార్కు ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని త్వరగా గుర్తించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌ఓ ఎ.మలోల, ఎస్‌పీడీసీఎల్ ఎస్‌ఈ సంపత్‌కుమార్, సర్వే ఏడీ రూప్లానాయక్, ఎన్‌హెచ్‌ఏఐ పీడీ తరుణ్‌కుమార్, కలెక్టరేట్ భూపరిపాలన సూపరింటెండెంట్ రియాజుద్ధీన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment