దుర్గమ్మ విగ్రహం లభ్యం
శింగనమల: దుండగులు అపహరించుకెళ్లిన దుర్గమ్మ పంచలోహ విగ్రహం లభ్యమైంది. సోమవారం ఆలయ సమీపంలో వరి పొలాల్లో దుర్గమ్మ పంచలోహ విగ్రహాన్ని గుర్తించిన స్థానిక రైతుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. విగ్రహాన్ని, అమ్మవారి వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 3న శింగనమల చెరువు కట్ట వద్ద ఉన్న దుర్గాంజనేయ స్వామి ఆలయం, దుర్గమ్మ ఆలయంలో దుండగులు చొరబడి 4 కిలోల వెండి కవచాలు, పంచలోహ విగ్రహాన్ని అపహరించిన విషయం తెలిసిందే. కాగా, దుర్గమ్మ ఆలయంలో చోరీ చేసిన సొత్తు లభ్యం కాగా, దుర్గాంజనేయస్వామి ఆలయంలో చోరీ చేసిన 4 కిలోల వెండి కవచాలు లభ్యం కావాల్సి ఉంది.
జీసీటీఏ జిల్లా
నూతన కార్యవర్గం
● అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ, కార్యదర్శిగా మనోహర్‌రెడ్డి
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపక సంఘం (జీసీటీఏ) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సోమవారం స్థానిక ఆర్ట్స్ కళాశాలలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కమిటీని కొత్తగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డాక్టర్ కే. లక్ష్మీనారాయణ (రాయదుర్గం), కార్యదర్శిగా డాక్టర్ బి.మనోహర్ రెడ్డి (అనంతపురం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా డాక్టర్ బి. రామచంద్ర (అనంతపురం), సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ కె. ఈశ్వర్ రెడ్డి (అనంతపురం), కోశాధికారిగా డాక్టర్ ఎంటీ జ్యోత్స్న, రాష్ట్ర కౌన్సిలర్లుగా డాక్టర్ టీఎస్. శ్యామ్‌ప్రసాద్, డాక్టర్ శివశంకర్, డాక్టర్ ఎంఎన్. బృంద, బి.జమీల బీబీని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా ఆశావాది శశాంక మౌలి వ్యవహరించారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment