రెండు గ్రామాలు..ఓ దేవర దున్న
ఓ దేవర దున్నపోతు పంచాయితీ రెండు గ్రామాల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల జోక్యంతో సోమవారం ఈ వివాదానికి తెర పడింది.
మంగళవారం శ్రీ 7 శ్రీ జనవరి శ్రీ 2025
అనంతపురంలోని టవర్‌క్లాక్ సమీపంలో ఉన్న షిర్డీ సాయి స్వీట్స్ దుకాణంలో మూడు నెలల క్రితం ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దుకాణంలో ఆహార పదార్థాలను పరిశీలించారు. నెయ్యి, ఐస్‌క్రీమ్ బర్ఫీలు నాసిరకంగా ఉన్నట్లు తేల్చారు. దుకాణ నిర్వాహకులకు జరిమానా విధించారు.
అనంతపురం లోని బెంగళూరు అయ్యంగార్
బేకరీలో నెల క్రితం అధికారులు తనిఖీలు చేపట్టారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలను వినియోగదారులకు
విక్రయిస్తున్నట్లు ప్రాథమికంగా
గుర్తించారు. నమూనాలను సేకరించి ల్యాబుకు పంపారు. వాస్తవమని తేలితే రూ. లక్ష వరకూ పెనాల్టీ విధించే అవకాశం ఉంది.
రూసా ల్యాబ్ ప్రారంభం
అనంతపురం: ఎస్కేయూ క్యాంపస్ ఫిజిక్స్ విభాగంలో రూసా (రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్షా అభియాన్) పథకం కింద రూ.2 కోట్లతో నిర్మించిన ల్యాబ్‌ను సోమవారం ప్రారంభించారు. 200 కంప్యూటర్లతో రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థులకు ఉపయోగపడే రీతిలో నిర్మించేందుకు గత ప్రభుత్వంలో నిధులు విడుదలయ్యాయి. పనులు పూర్తవడంతో ఎస్కేయూ రిజిస్ట్రార్ డాక్టర్ రమేష్ బాబు ల్యాబ్‌ను ప్రారంభించారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు విద్యార్థులకు ల్యాబ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్కేయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. రామచంద్ర, సీడీసీ డీన్ ప్రొఫెసర్ కే. రామ్‌గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
పరీక్ష ఫలితాల విడుదల
అనంతపురం: ఎంబీఏ, ఎంసీఏ ఫలితాలను జేఎన్‌టీయూ(ఏ) ఉన్నతాధికారులు విడుదల చేశారు. నవంబర్, డిసెంబర్‌లో నిర్వహించిన ఎంబీఏ, ఎంసీఏ మూడో సెమిస్టర్ (ఆర్–21)రెగ్యులర్, సప్లిమెంటరీ, నాలుగో సెమిస్టర్ సప్లిమెంటరీ, ఎంసీఏ ఐదో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి. నాగప్రసాద్ నాయుడు సోమవారం విడుదల చేశారు. ఫలితాలకు జేఎన్‌టీయూ(ఏ) వెబ్‌సైట్‌లో చూడాలని కోరారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ ప్రొఫెసర్ రాజు, డాక్టర్ ఎం. అంకారావు, డాక్టర్ ఎస్.శ్రీధర్ పాల్గొన్నారు.
మాజీ సైనికుడి ఆత్మహత్య
బుక్కరాయసముద్రం: బావిలో పడి మాజీ సైనిక ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని వడియంపేటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం మారుతీ నగర్ 4వ క్రాస్‌లో నివాసం ఉంటున్న సంతోష్‌కుమార్–43 సీఐఎస్‌ఎఫ్‌లో ఉద్యోగం చేసేవారు. ఇతనికి ఇద్దరు భార్యలు. కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్యలు సీఐఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా.. ఇటీవల ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయాయి. మనస్తాపం చెందిన సంతోష్‌కుమార్ వడియంపేట సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో పడి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి సీఐ కరుణాకర్ చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
●దడ పుట్టిస్తున్న బేకరీలు, హోటళ్ల నిర్వాహకులు ●ఆహా అనిపిస్తూనే చుక్కలు చూపిస్తున్న వైనం
●వారాల తరబడి ఆహార పదార్థాల నిల్వ ●నాణ్యతలేని పదార్థాలతో వంటకాలు ●ప్రజల ఆరోగ్యంతో చెలగాటం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో హోటళ్లు, బేకరీల నిర్వాహకుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. నాసిరకం నూనెల వాడకం మొదలు మాంసాహారాన్ని వారాల తరబడి నిల్వ ఉంచుతున్నారు. దాన్నే ఆహార ప్రియులకు వడ్డిస్తూ ఆస్పత్రుల పాల్జేస్తున్నారు. రోజూ ఏదో ఒక చోట ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది.
రోజుల తరబడి నిల్వ..
అనంతపురం, గుంతకల్లు, గుత్తి, కళ్యాణదుర్గం, కదిరి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో బేకరీలు, హోటళ్లు ఉన్నాయి. వీటిలో అమ్మకాలకు ఉంచుతున్న ఆహారంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వెజ్ పఫ్‌లు, ఎగ్‌పఫ్‌లు రోజుల తరబడి నిల్వ ఉంచుతున్నారు. ఈ క్రమంలో బూజు పట్టినా కస్టమర్లకు అప్పటికప్పుడు ఓవెన్‌లో వేడిచేసి ఇస్తున్నారు. ఆ పదార్థం తిన్నవారు ఫుడ్‌పాయిజన్‌తో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు ఎక్కువకాలం నిల్వ ఉంచిన ఐస్‌క్రీంలు, కేక్‌లు తిని అనారోగ్యం బారిన పడుతున్నారు.
కఠిన శిక్షలు లేకే..
ఇటీవల అనంతపురంలోని వివిధ బేకరీలు, హోటళ్లలో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నగరంలోని అలెగ్జాండర్ హోటల్‌లో చికెన్ లాలీపప్‌పై ప్రమాదకర రంగులు చల్లినట్టు గుర్తించి కేసు నమోదు చేశారు. బెంగుళూరు హైవేలోని పాకశాల, తాడిపత్రి బిరియాని హోటళ్లలో అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు వండుతున్నట్లు పరిశీలనలో వెల్లడైంది. స్వగృహ స్వీట్స్ దుకాణంలో కొన్ని ఆహార పదార్థాల నమూనాలు సేకరించారు. ఇంకా రిపోర్టులు రావాల్సి ఉంది. అయితే, జరిమానాలు విధిస్తున్నా నిర్వాహకులు దారికి రాకపోవడం గమనార్హం. ఆహార భద్రతా చట్టం పరిధిలో కఠిన శిక్షలు లేకపోవడంతో బరితెగిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు హోటళ్ల యజమానులైతే రాజకీయ నాయకులకు ఫోన్ చేసి తమపై ఈగ కూడా వాలకుండా చేసుకుంటుండటం గమనార్హం.
లైసెన్సుతో నడుస్తున్న హోటళ్లు
200 లోపు
చీనీ టన్ను రూ.26 వేలు
అనంతపురం మార్కెట్‌యార్డులో సోమవారం చీనీకాయలు టన్ను గరిష్ట ధర రూ.26 వేలు పలికాయి.
నెల క్రితం అనంత పురంలోని ఎస్‌ఎస్ ప్యాలెస్ హోటల్‌కెళ్లిన ముగ్గురు స్నేహితులు చేపల కర్రీ ఆర్డర్ చేశారు. సిబ్బంది వడ్డించిన కర్రీ నాణ్యతగా లేకపోవడంతో నిర్వాహకులను ప్రశ్నించారు. వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఆహార భద్రతా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు నమూనాలు తీసి ల్యాబుకు పంపించారు. ఈ మూడు చోట్లే కాదు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇదే దుస్థితి.
8లో
న్యూస్‌రీల్
550 పైనే
అనంతపురం జిల్లాలో హోటళ్లు
300 పైనే
శ్రీ సత్యసాయి జిల్లాలో హోటళ్లు
150 లోపు
లైసెన్సుతో నడుస్తున్నవి
140 వరకు
రెండు జిల్లాల్లో బేకరీలు
నాణ్యత లోపిస్తే చర్యలు
హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లో నాసిరకం ఆహార పదార్థాలు అందించినా, పారిశుధ్యం లోపించినా కఠిన చర్యలు తీసుకుంటాం. తనిఖీలు ముమ్మరం చేశాం. కేసును బట్టి పెనాల్టీలు విధిస్తున్నాం. ఎంత పెద్ద హోటల్లో అయినా నాణ్యత లోపిస్తే చర్యలకు వెనుకాడబోం.
–తస్లీమా, ఫుడ్ ఇన్‌స్పెక్టర్
Comments
Please login to add a commentAdd a comment