మహమ్మారి పొంచి ఉన్నా మొద్దునిరద్రే..
అనంతపురం మెడికల్: కోవిడ్ మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. వేల సంఖ్యలో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి. కోవిడ్ పేరు వింటే ఇప్పటికీ హడలెత్తిపోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఇటీవల అదే కోవకు చెందిన మరో వైరస్ కలవరపెడుతోంది. ఉమ్మడి జిల్లాకు సమీపంలోని బెంగళూరులో పంజావిసిరింది. దీంతో కర్ణాటక వాసులే కాకుండా దేశమే ఉలిక్కి పడింది. ఇంత జరుగుతున్నా ఉమ్మడి జిల్లాలో అధికార యంత్రాంగం మొద్దు నిద్ర వీడకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వందలాది మంది రాకపోకలు..
చైనాలో హ్యూమన్ మెటాన్యూమో వైరస్ (హెచ్‌ఎంపీవీ) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మనదేశంలోనూ ఈ మహమ్మారి జాడలు బెంగళూరులో కన్పించాయి. ఇద్దరు శిశువుల్లో హెచ్‌ఎంపీవీ వైరస్ ఆనవాళ్లు ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. జిల్లా నుంచి బెంగళూరుకు, అక్కడి నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు రోజూ వేలాది మంది ప్రయాణిస్తుంటారు. హైదరాబాద్ నుంచి వచ్చే వారు సైతం అనంతపురం మీదుగానే బెంగళూరుకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇలాంటి తరుణంలో జిల్లాపై వైరస్ ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆరోగ్యశాఖాధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. సర్వజనాస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాల్సి ఉన్నా, అటువంటి చర్యలేమీ తీసుకోలేదు. పైగా జిల్లాలో కేసులు నమోదుకాలేదంటూ వైద్య ఆరోగ్యశాఖాధికారి ప్రకటన ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది.
వ్యాప్తి ఇలా..
తుమ్ములు, దగ్గు వల్ల వెలువడే తుంపర్ల నుంచి, వైరస్ బారిన పడ్డ వారితో సన్నిహితంగా ఉండడం తదితర చర్యల ద్వారా హెచ్‌ఎంపీవీ వ్యాప్తి చెందుతుంది.
నివారణ:
చేతులు తరచూ సబ్బుతో కనీసం 20 సెకన్లు కడుక్కోవాలి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలి. వైరస్ సోకితే బయట తిరగకూడదు.
బెంగళూరులో ‘హెచ్‌ఎంపీవీ’ కలకలం
ఇద్దరు శిశువులకు
వైరస్ నిర్ధారణ
నిద్రమత్తులో కూటమి ప్రభుత్వం
ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఆరోగ్యశాఖాధికారుల విఫలం
చిన్నపిల్లలు, వృద్ధులపై ప్రభావం
హ్యూమన్ మెటా న్యూమో వైరస్‌కు సంబంధించిన కేసులు జిల్లాలో నమోదు కాలేదు. ఈ వైరస్ కూడా కరోనా తరహాలో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. చిన్నపిల్లలు, వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై ప్రభావం అధికంగా ఉంటుంది. కోవిడ్ సమయంలో తీసుకున్న జాగ్రత్తలే తీసుకోవాలి. వైరస్ సోకినట్లు అనుమానం ఉన్న వారు వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలి. ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉంది. ముందస్తు చర్యలు చేపడతాం.
– డాక్టర్ భ్రమరాంబ దేవి,
డీఎంహెచ్‌ఓ
లక్షణాలు ఇలా..
కోవిడ్ తరహాలో హెచ్‌ఎంపీవీ కూడా శ్వాసకోశ రుగ్మతలను కలిగి స్తుంది. జ్వరం, దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి తదితర లక్షణాలుంటాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో బ్రాంౖకైటీస్, నిమోనియాకు దారితీస్తుంది. చిన్నారులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిని తీవ్రంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment