కవర్ తొడిగిన కాయ
కోక కట్టిన తోట..
పంటల సాగులో నాణ్యమైన దిగుబడులు సాధించేందుకు రైతులు నూతన విధానాలను అవలంభిస్తున్నారు. తమకు అందుబాటులో ఉన్న వనరులతోనే నాణ్యమైన దిగుబడి సాధించేలా కార్యాచరణను చేపట్టారు. ఇందులో భాగంగా రాప్తాడు మండలం చిన్నంపల్లి వద్ద రైతు నారాయణస్వామి సాగు చేసిన దానిమ్మ పంటలో అడవి పందులు, జింకలు చొరబడకుండా చుట్లూ చీరలతో కంచె ఏర్పాటు చేశారు. కాయకు తెగుళ్లు సోకకుండా కవర్ తొడిగారు. అలాగే శింగనమల మండలం బుక్కరాయసముద్రం వద్ద రైతులు చేపట్టిన అరటి సాగులో గెలలకు కవర్ చుట్టి కాయ నాణ్యతను కాపాడేలా చర్యలు తీసుకున్నారు. ఇలా చేస్తే నాణ్యమైన దిగుబడి పక్కా అని రైతులు అంటున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం:
చిన్నంపల్లిలో దానిమ్మ తోట చుట్టూ చీరలతో వేసిన కంచె
Comments
Please login to add a commentAdd a comment