సుప్రీంకోర్టులో ఏపీ రాజధాని కేసు విచారణ | Ap Capital Case Hearing In Supreme Court | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టులో ఏపీ రాజధాని కేసు విచారణ

Published Wed, Jan 3 2024 11:11 AM | Last Updated on Wed, Jan 3 2024 2:01 PM

Ap Capital Case Hearing In Supreme Court - Sakshi

సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టులో ఏపీ రాజధాని కేసు విచారణ జరిగింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా,  జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం విచారణ చేపట్టారు. రాజధాని కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసిన సుప్రీం.. ఈ లోగా అన్ని పక్షాలు తమ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న ఏపీ హైకోర్టు  తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదని తెలిపింది. రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమ తమ అధికార పరిధుల్లో పని చేయాలి. శాసన, పాలన వ్యవస్థ అధికారాలలోకి న్యాయవ్యవస్థ చొరబడటం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధం’’ అని పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిసిందే

ఏపీ సర్కార్‌ పిటిషన్‌లో ముఖ్యంశాలు
తమ రాజధానిని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం సమాఖ్య వ్యవస్థకు నిదర్శనం
రాష్ట్ర ప్రభుత్వానికి తమ రాజధాని నిర్ణయించుకునే సంపూర్ణ అధికారం ఉంది
ఒకే రాజధాని ఉండాలని ఏపీ విభజన చట్టంలో లేనప్పటికీ, చట్టానికి తప్పుడు అర్ధాలు చెప్తున్నారు
రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక, జీ ఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు నివేదిక, హైపవర్డ్ కమిటీ నివేదికలను హైకోర్టు పట్టించుకోలేదు
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజధానిని కేవలం అమరావతిలోని కేంద్రీకృతం చేయకుండా, వికేంద్రీకరణ చేయాలని ఈ నివేదికలు సూచించాయి
2014-19 మధ్య కేవలం అమరావతి ప్రాంతంలో 10 శాతం మౌలిక వసతుల పనులు మాత్రమే తాత్కాలికంగా జరిగాయి
అమరావతిలో రాజధాని నిర్మాణానికి 1,09,000 కోట్ల రూపాయలు అవసరం
రాజధాని వికేంద్రీకరణ ఖర్చు కేవలం 2000 కోట్ల రూపాయలతో పూర్తి 
రైతులతో జరిగిన అభివృద్ధి ఒప్పందాల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదు
వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధి జరగదని భావించడంలో ఎలాంటి సహేతుకత లేదు
రైతుల ప్రయోజనాలన్నీ రక్షిస్తాం
అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుంది. ఆ మేరకు అక్కడ అభివృద్ధి జరుగుతుంది

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement