చేతబడి: నిద్ర లేచి తలుపు తెరచి చూస్తే.. | Chetabadi Madanapalle Town Unknown Persons Police Complaint | Sakshi
Sakshi News home page

చేతబడి: నిద్ర లేచి తలుపు తెరచి చూస్తే..

Published Fri, Apr 8 2022 4:02 PM | Last Updated on Fri, Apr 8 2022 4:02 PM

Chetabadi Madanapalle Town Unknown Persons Police Complaint - Sakshi

సాక్షి, మదనపల్లె టౌన్‌: గుర్తుతెలియని వ్యక్తులు తమ ఇంటివద్ద చేతబడి చేసి భయాందోళనకు గురి చేస్తున్నారని, వారి నుంచి ప్రాణహాని ఉందని ఓ వ్యక్తి వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. పట్టణంలోని కోటవీధికి చెందిన మురళి ఇంటి ముందు బుధవారం రాత్రి మేకులు కొట్టి ఉన్న దుస్తులతో తయారు చేసిన బొమ్మ, నిమ్మకాయలు, నాలుగు కోడిగుడ్లు, మట్టికుండను ఉంచి ఇంటిముందు కుంకుమ చల్లి వెళ్లారన్నారు.

అయితే గురువారం ఉదయం బాధితుని కుటుంబీకులు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండడంపై తమకు సమాచారం రావడంతో అక్కడికి చేరుకుని మున్సిపాలిటీ సిబ్బందితో వాటిని తీసివేయించామని తెలిపారు. జరిగిన ఘటనపై బాధితుడి నుంచి వివరాలు సేకరించామన్నారు. ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు.  

చదవండి: (ఆకాష్‌ మిర్చి: రూటే సపరేటు.. కిలో రూ.120 నుంచి రూ.140)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement